Begin typing your search above and press return to search.

హిట్ డైరెక్టర్.. నాని షాక్ ఇచ్చినట్లున్నాడే?

ఇక మరోవైపు అదే ప్రొడక్షన్లో నాని మరొక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 March 2024 11:14 AM GMT
హిట్ డైరెక్టర్.. నాని షాక్ ఇచ్చినట్లున్నాడే?
X

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పవర్ ఫుల్ లైనప్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తన మార్కెట్ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. గత ఏడాది దసరా -హాయ్ నాన్న సినిమాలతో సాలిడ్ సక్సెస్ లను అందుకున్న నాని ఇప్పుడు కూడా అదే తరహాలో అడుగులు వేసే విధంగా ప్రాజెక్టులను ఓకే చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

డివివి.దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు దాదాపు షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. ఇక మరోవైపు అదే ప్రొడక్షన్లో నాని మరొక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న ఆ సినిమాపై కూడా ఇటీవల నాని పుట్టినరోజున అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది.

ఇక నాని లిస్టులో బలగం దర్శకుడు కూడా ఉన్నాడు. వేణు ఇదివరకే రెండు మూడు సార్లు నానిని కలిసి కథపై చర్చలు జరిపాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే 1980 కాలం నాటికి తగ్గట్టుగా ఆ సినిమా ఉండబోతుందట. ఇక నాని కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే నాని లిస్టులో దసరా దర్శకుడు శ్రీకాంత్ కూడా ఉన్నాడు.

అతను కూడా ఒక కథను సిద్ధం చేశాడు. అయితే కొన్ని మార్పులు కావాలి అని నాని అడగడంతో మళ్ళి స్క్రిప్ట్ పై అతను రీ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరో డైరెక్టర్ కి నాని ఇటీవల పెద్ద షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు హిట్ సిరీస్ లతో మంచి క్రైజ్ అందుకున్న శైలేష్ కొలను. ఇటీవల అతను డైరెక్ట్ చేసిన సైంధవ్ సినిమా సంక్రాంతికి వచ్చింది. ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

ఇక అంతకుముందే నానితో హిట్ 3 సినిమాను అనౌన్స్ చేసిన శైలేష్, హిట్ 2లో నాని క్యారెక్టర్ కు సంబంధించిన ఒక సీన్ కూడా చివరలో హైలెట్ చేశాడు. అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ కూడా నానికి బాగానే నచ్చింది. అసలైతే ఈ ప్రాజెక్టు సమ్మర్ లోనే మొదలు కావాల్సింది. కానీ సైంధవ్ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో శైలేష్ తో నాని మరోసారి చర్చలు జరపాల్సి వచ్చింది.

హిట్ 3 స్క్రిప్ట్ కూడా అంతగా కాన్ఫిడెంట్ అనిపించకపోవడంతో మళ్లీ పూర్తిస్థాయిలో రివర్క్ చేయాలి అని సూచించినట్లు సమాచారం. దీంతో శైలేష్ మొదటి నుంచి కథను సరికొత్తగా రూపొందిస్తున్నట్లు సమాచారం. సైంధవ కొట్టిన దెబ్బతో శైలేష్ కు ఇప్పుడు మరో హీరోలు అవకాశం ఇవ్వడం కష్టమే. కాబట్టి నానిని ఇదే కథతో త్వరగా మెప్పించాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా శైలేష్ అడుగులు వేస్తాడో లేదో చూడాలి.