Begin typing your search above and press return to search.

హీటెక్కిస్తోన్న హిట్ కాంబినేష‌న్స్!

హిట్ కాంబినేష‌న్స్ అంటే ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పీక్స్ కి చేరుతాయి. మ‌ళ్లీ ఆ జోడీలు ఎప్పుడు చేతులు క‌లుపుతాయా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు

By:  Tupaki Desk   |   1 Nov 2023 4:30 PM GMT
హీటెక్కిస్తోన్న హిట్ కాంబినేష‌న్స్!
X

హిట్ కాంబినేష‌న్స్ అంటే ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పీక్స్ కి చేరుతాయి. మ‌ళ్లీ ఆ జోడీలు ఎప్పుడు చేతులు క‌లుపుతాయా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా కొన్ని కాంబినేష‌న్స్ మ‌ళ్లీ ఊపందుకుం టున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఓ సారి ఆ కాంబినేష‌న్స్ ఏంటో చూస్తే స‌రి..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా ఉంటుంద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 'జులాయి'... 'స‌న్నాఫ్ స‌త్య‌మూరి'...'అల‌వైకుంఠ‌పుర‌ములో' లాంటి హ్యాట్రిక్ చిత్రాల‌తో అల‌రించిన ద్వ‌యం మ‌రోసారి చేతులు క‌ల‌ప‌డంతో అంచ‌నాలు పీక్స్ కి చేరుతున్నాయి. బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిన నేప‌థ్యంలో ఈ జోడీ చేతులు క‌ల‌ప‌డం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

ఇక యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌- చందు మొండేటి గ్రేట్ కాంబో గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'స‌వ్య‌సాచి' లాంటి డిఫ‌రెంట్ అటెంప్ట్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. క‌మ‌ర్శియ‌ల్ గా సినిమా వ‌ర్కౌట్ కాన‌ప్ప‌టికీ వైవిథ్య‌మైన ప్ర‌య‌త్నం ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ కి బాగా క‌నెక్ట్ అయింది. ఇప్పుడిదే క‌ల‌యిక‌లో పాన్ ఇండియాలో ఓ సినిమా రూపొందుంతుంది. పైగా చందు మొండేటి కార్తికేయ‌-2 తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన త‌ర్వాత చేస్తోన్న చిత్రం కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డుతున్నాయి.

అలాగే న‌ట‌సింహ బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక అంటేనే ఓ సంచ‌ల‌నం. ఇప్ప‌టికే 'సింహ‌'..'లెజెండ్'..'అఖండ' ల‌తో హ్యాట్రిక్ న‌మోదు చేసారు. అదే వేవ్ లో 'అఖండ‌-2' కూడా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంబినేష‌న్ డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదు చేయాల‌న్న‌ది ప్లాన్. దీనిలో భాగంగా బాల‌య్య కోసం బోయ‌పాటి ప్ర‌త్యేక‌మైన క‌థ‌లే సిద్దం చేస్తున్నారు. 'అఖండ‌-2' ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌- సుకుమార్ క‌ల‌యిక గురించి చెప్పేదేముంది. 'రంగ‌స్థ‌లం'తో మార్కెట్ నే షేక్ చేసిన కాంబో అది. ఆ విజ‌యం త‌ర్వాత రంగ‌స్థ‌లం సీక్వెల్ ఉంటుందా? అని ప్ర‌చారం సాగింది. అందుకు త‌గ్గ‌ట్టు ఆస్కోప్ ఉంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. సుక్కుతో సినిమా చేయ‌డానికి చ‌ర‌ణ్ వెయిట్ చేస్తున్నాడు. సుకుమార్ స్టోరీ వినిపించాలే గానీ...చ‌ర‌ణ్ సీన్ లోకి వ‌చ్చేస్తాడు.

అలాగే మాస్ రాజా ర‌వితేజ‌-గోపీచంద్ మ‌లినేని జోడికి తిరుగులేదు. ఈ కల‌క‌యిలో నాల్గ‌వ సినిమా ప్రారంభ‌మైంది. ఇంకా విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ప‌ర‌శురాం 'గీతగోవిందం' త‌ర్వాత మ‌రో సినిమా ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇంకా మ‌రికొన్ని హిట్ కాంబినేష‌న్స్ సెట్స్ కి వెళ్ల‌డానికి రెడీ అవుతున్నాయి.