Begin typing your search above and press return to search.

ఓ ప‌క్క ర‌క్తం కారుతుంటే ఇంకెన్ని షాట్స్ ఉన్నాయ‌న్నాడు

అందులో డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను మాట్లాడుతూ సినిమా గురించి ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను షేర్ చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   28 April 2025 1:57 PM IST
Sailesh Kolanu About Nani
X

నాని హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా హిట్3. ఈ సినిమా మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌గా, అందులో డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను మాట్లాడుతూ సినిమా గురించి ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను షేర్ చేసుకున్నాడు. హిట్‌వ‌ర్స్ లో భాగ‌మైన విశ్వ‌క్, శేష్, నాని.. ముగ్గురినీ ప‌క్క ప‌క్క‌నే చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంద‌నిపిస్తుంద‌న్నాడు.

రాజ‌మౌళి హిట్‌వ‌ర్స్‌కు ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయార‌ని, మేమెన్ని హిట్ సిరీస్‌లు చేసినా అన్నింటికీ మీరే గెస్ట్ గా రావాల‌ని కోరుకుంటున్నాను. మీరు మా ల‌క్కీ ఛార్మ్ అయిపోయారు. అందుకే స్వార్థంతో అడుగుతున్నాన‌ని చెప్పిన శైలేష్, ఈసారి త‌న‌కంటే త‌న పనే ఎక్కువ మాట్లాడాల‌నుకుంటున్నాన‌ని, సినిమాకు వ‌ర్క్ చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్ చెప్పారు.

హిట్3 మొద‌లుపెట్టిన‌ప్పుడు ఎన్నో రూమ‌ర్స్ ఉన్నాయ‌ని, కానీ త‌ర్వాత అవ‌న్నీ పోయాయ‌ని, ఈ సినిమాను నాని ఓకే చేసిన‌ప్పుడు చాలా భ‌య‌ప‌డ్డాన‌ని, దానికి కార‌ణం నానిపై త‌న‌కున్న ఇష్ట‌మేన‌ని, ద‌గ్గ‌ర‌య్యే కొద్దీ ప్రేమ త‌గ్గుతుంద‌ని భ‌య‌పడ్డా కానీ ఈ జ‌ర్నీలో నానికి ఉన్న ప్యాష‌న్, సినిమా ప‌ట్ల ఆయ‌న‌కున్న మ్యాడ్ లవ్ ను చూశాన‌ని ఈ సంద‌ర్భంగా తెలిపాడు.

నానికి ఏదైనా ఐడియా చెప్ప‌డానికి నైట్ 10 గంట‌ల‌కు హోట‌ల్ కు వెళ్తే ఆ టైమ్ లో ఆయ‌న ఏదొక సినిమా చూస్తూ ఉంటాడ‌ని, స‌ర‌దాగా కూర్చొని మాట్లాడ‌దామ‌న్నా సినిమా గురించే మాట్లాడ‌తార‌ని, ఆయ‌నేం మాట్లాడినా ప్ర‌తీదీ సినిమా చుట్టూనే తిరుగుతుంటుంద‌ని చెప్పాడు. సినిమాలో ఒక ఫైట్ కోసం డ్రోన్ షాట్ తీస్తున్న టైమ్‌లో ఫైర్ వ‌చ్చి ఆయ‌న నెత్తి మీద ప‌డి ఓ ప‌క్క హెయిర్ కాలిపోయింద‌ని, ఇక ఆ రోజుకు షూటింగ్ ఉండ‌దు, ప్యాక‌ప్ చెప్దాం అనుకునే టైమ్ కు క్యారావ్యాన్ కు వెళ్లి హెయిర్ సెట్ చేసుకుని వ‌చ్చి షాట్ కు రెడీ అన్నాడ‌ని, దాంతో ఏంటి ఈ మ‌నిషి అనుకున్నాన‌ని చెప్పాడు.

అలా షాట్ చేస్తున్న టైమ్ లో కెమెరా త‌ల‌కు త‌గిలి చ‌ర్మం చీలి, ర‌క్తం కారిపోతుంటే ఇంకెన్ని షాట్స్ ఉన్నాయ‌ని అడిగి, ర‌క్తం గ‌డ్డ క‌ట్టేవ‌ర‌కు ఆగి షూటింగ్ పూర్తి చేశాడ‌ని, ఆ రోజు నైట్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని మ‌ళ్లీ మార్నింగ్ 5 గంట‌ల‌కు శ్రీన‌గ‌ర్ వ‌చ్చి అక్క‌డి నుంచి 3 గంట‌లు జ‌ర్నీ చేసి -12 డిగ్రీస్ లో షూటింగ్ చేస్తున్న లొకేష‌న్‌కు వ‌చ్చాడ‌ని, నానికి సినిమా అంటే అంత ప్యాష‌న్ ఉంద‌ని, అందుకే సినిమా చేసినా చేయ‌క‌పోయినా ఆయ‌న ప‌క్క‌నుంటే ఇన్స్‌పిరేష‌న్ గా ఉంటుందనిపిస్తుంద‌ని చెప్పిన శైలేష్, త‌న‌ను నమ్మి త‌న‌కు అవ‌కాశం ఇచ్చినందుకు నానికి ఎన్ని థాంక్స్‌లు చెప్పినా త‌క్కువేన‌ని శైలేష్ అన్నాడు.