బుక్‌మైషో టాప్ రికార్డ్స్: హిట్ 3, రైడ్ 2 రచ్చ!
ఈ ట్రెండ్ చూస్తే, ఈ వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద మరింత జోష్ కనిపించేలా ఉంది. ‘హిట్ 3’ సినిమా నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
By: Tupaki Desk | 3 May 2025 12:30 AMటాలీవుడ్‌లో ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి జోరుగా సాగుతోంది. మేముఖ్యంగా నిన్న విడుదలైన సినిమాలు థియేటర్లలో హంగామా చేస్తున్నాయి. బుక్‌మైషోలో టికెట్ల బుకింగ్స్ చూస్తే, ఈ సినిమాలపై ప్రేక్షకుల క్రేజ్ ఎంత ఉందో అర్థమవుతోంది. నాని ‘హిట్ 3’, అజయ్ దేవ్‌గణ్ ‘రైడ్ 2’, మోహన్‌లాల్ ‘తుడరుమ్’, సూర్య ‘రెట్రో’ సినిమాలు బుకింగ్స్‌లో రచ్చ చేస్తున్నాయి. ఈ సినిమాలు లేబర్ డే సందర్భంగా భారీ ఓపెనింగ్స్ సాధించాయి.
ఈ ట్రెండ్ చూస్తే, ఈ వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద మరింత జోష్ కనిపించేలా ఉంది. ‘హిట్ 3’ సినిమా నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్, సస్పెన్స్‌తో యూత్‌ను ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లో హౌస్‌ఫుల్ షోలతో సినిమా దూసుకెళ్తోంది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ స్టైల్ బ్యాక్‌డ్రాప్‌తో ఆకట్టుకుంటోంది. రిలీజైన తొలి రోజు నుంచే సూపర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా యూఎస్‌లో కూడా నెక్స్ట్ జనరేషన్ ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది.
లేటెస్ట్ గణాంకాల ప్రకారం, బుక్‌మైషోలో చివరి 24 గంటల్లో
‘రైడ్ 2’ 279.2K టికెట్లతో టాప్‌లో నిలిచింది.
‘హిట్ 3’ 272.95K టికెట్లతో రెండో స్థానంలో ఉంది.
‘తుడరుమ్’ 7వ రోజున 257.93K టికెట్లతో మూడో స్థానంలో ఉండగా... సూర్య ‘రెట్రో’ 233.52K టికెట్లతో నాల్గో స్థానంలో ఉంది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ 45.85K, ‘కేసరి చాప్టర్ 2’ 14వ రోజున 31.08K టికెట్లతో టాప్-6లో ఉన్నాయి. ఈ సినిమాలు లేబర్ డే సందర్భంగా మంచి ఓపెనింగ్స్ సాధించాయి.
‘రైడ్ 2’ అజయ్ దేవ్‌గణ్ నటన, రితేష్ దేశ్‌ముఖ్ సీన్స్‌తో బాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది. ‘తుడరుమ్’ మలయాళంలో రిలీజై ఏడు రోజులు గడిచినా ఇంకా బుకింగ్స్‌లో జోరు కొనసాగిస్తోంది. మోహన్‌లాల్ నటన, తరుణ్ మూర్తి డైరెక్షన్‌తో ఈ సినిమా రూ.70 కోట్ల మార్క్‌ను దాటింది. ఇక ‘రెట్రో’ సినిమా సూర్య, పూజా హెగ్డే జోడీతో తమిళ ఆడియన్స్‌ను అలరిస్తోంది.
‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘కేసరి చాప్టర్ 2’ సినిమాలు కూడా బుకింగ్స్‌లో మంచి స్పీడ్ చూపిస్తున్నాయి. ‘కేసరి చాప్టర్ 2’ 14 రోజులుగా థియేటర్లలో నిలకడగా ఆడుతోంది. అక్షయ్ కుమార్ నటన, జలియన్‌వాలా బాగ్ నేపథ్యంతో ఈ సినిమా ఆకర్షిస్తోంది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తొలి రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. మొత్తంగా, ‘హిట్ 3’, ‘రైడ్ 2’, ‘తుడరుమ్’, ‘రెట్రో’ సినిమాలు బుక్‌మైషోలో టికెట్ బుకింగ్స్‌తో రచ్చ చేస్తున్నాయి. ఈ సినిమాలు వీకెండ్‌లో మరింత జోరు చూపిస్తే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ఇక ఫైనల్ గా సినిమాలు ఎలాంటి వసూళ్లు సాధిస్తాయో చూడాలి.