హాలీవుడ్ స్టైల్‌లో ‘హిట్ 3’
నాచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 1 May 2025 5:00 PM ISTనాచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సూపర్ టాక్ తెచ్చుకుంది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా, నాని కెరీర్‌లో మరో ట్రెండ్ సెట్టర్ గా నిలిచేలా కనిపిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు బూస్ట్ ఇచ్చింది. యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్స్‌తో నిండిన ఈ సినిమా యూత్, ఎన్‌ఆర్‌ఐ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది.
‘హిట్’ ఫ్రాంచైజ్‌లో మూడో సినిమాగా వచ్చిన ‘హిట్ 3’ బంపర్ ఓపెనింగ్స్ సాధించింది. పలుచోట్ల బుకింగ్స్ ఆలస్యమైనా, ఇప్పుడు ఫాస్ట్ ఫిల్లింగ్‌తో జోరు చూపిస్తోంది. సినిమాలో నాని పవర్‌ఫుల్ ఆఫీసర్ రోల్, ట్రైలర్‌లో చూపించిన థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ సినిమా యంగ్ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
సినిమా హైలైట్ ఏంటంటే, దీని హాలీవుడ్ స్టైల్ బ్యాక్‌డ్రాప్. సినిమా విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని టాక్ వచ్చింది. ఈ స్టైలిష్ అప్రోచ్ యూత్, ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. యూఎస్‌లో సినిమా ఓపెనింగ్స్ సూపర్ పాజిటివ్ టాక్‌తో మొదలయ్యాయి. నెక్స్ట్ జనరేషన్ యూత్‌కు సినిమా ఫుల్ కిక్ ఇచ్చిందని సోషల్ మీడియాలో రివ్యూస్ వస్తున్నాయి. నాని ఈ సినిమాతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేశాడని అంటున్నారు.
సినిమాలో నాని నటన, స్టైలిష్ లుక్‌తో అదరగొట్టాడు. హాలీవుడ్ లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ప్లస్ అయ్యాయి. యాక్షన్ ఎపిసోడ్స్‌లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్, క్యామియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూఎస్‌లో ఈ సినిమా నెక్స్ట్ జనరేషన్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఫస్ట్ డే షోస్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు, సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూస్ సినిమా సక్సెస్‌ను సూచిస్తున్నాయి. ఈ టాక్ కొనసాగితే, సినిమా వీకెండ్ కలెక్షన్స్ భారీగా ఉంటాయని ట్రేడ్ అంచనా.
‘హిట్ 3’ బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ సాధించడంతో నాని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కు ఏ స్థాయిలో రీచ్ అవుతుంది అనేది చూడాలి. కానీ యూత్, మాస్ ఆడియన్స్‌ను రీచ్ చేస్తూ సినిమా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. సినిమా కంటెంట్ బలంగా ఉండటంతో ఈ లక్ష్యం సాధ్యమేనని నాని టీమ్ ధీమాగా ఉంది. మొత్తంగా, ‘హిట్ 3’ హాలీవుడ్ స్టైల్‌తో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సృష్టించింది. నాని ట్రెండ్ సెట్టింగ్ పెర్ఫార్మెన్స్, సినిమా స్టైలిష్ మేకింగ్ యూత్, ఎన్‌ఆర్‌ఐలను ఆకట్టుకుంటోంది. యూఎస్‌లో సూపర్ ఓపెనింగ్స్, ఇండియాలో పాజిటివ్ టాక్‌తో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్ళడం పక్కా అని అంటున్నాడు. మరి ఈ వీకెండ్‌లో సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
