Begin typing your search above and press return to search.

విశ్వ‌క్ లోటును గుర్తించిన నెటిజ‌న్లు

హిట్‌వ‌ర్స్ లో విక్ర‌మ్ రుద్ర‌రాజు సాల్వ్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయ‌ని విశ్వ‌క్ చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తుంటే రాబోయే సినిమాల్లో విశ్వ‌క్ పాత్ర క‌న్ఫ‌ర్మ్ అని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 May 2025 9:10 PM IST
విశ్వ‌క్ లోటును గుర్తించిన నెటిజ‌న్లు
X

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన హిట్3 సినిమా మొన్న గురువారం రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకెళ్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో హిట్2 స్టార్ అడివి శేష్ గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఉంద‌నే విష‌యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే లీకైన‌ప్ప‌టికీ ఆ విష‌యం తెలియ‌ని వాళ్ల‌కు మాత్రం మూవీలో స‌ర్‌ప్రైజ్ బాగానే వ‌ర్క‌వుట్ అయింది.

హిట్3 సినిమా చూశాక హిట్1లో హీరోగా న‌టించిన విక్ర‌మ్ రుద్ర‌రాజు కూడా హీరోగా ఉంటే బావుండేద‌ని విశ్వ‌క్ ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు. పార్ట్1 లోని విజువ‌ల్స్ కొన్నింటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ విశ్వ‌క్ సేన్ హిట్3లో లేని వెలితిని తెలుపుతున్నారు. విశ్వ‌క్ కెరీర్లోనే హిట్ మూవీ స్పెష‌ల్ అనే విష‌యం అందరికీ తెలిసిందే.

అలాంటి విశ్వ‌క్ పాత్ర హిట్3 లో ఎందుకు లేద‌నేది ఎవ‌రికీ తెలియదు. డైరెక్ట‌ర్ శైలేష్ అస‌లు విశ్వ‌క్ పాత్ర రాయ‌లేదా లేదంటే రాసినా విశ్వ‌క్ నో చెప్పాడా అనేది తెలీదు కానీ మొత్తానికి ముగ్గుర్నీ ఒకే ఫ్రేమ్ లో చూసే అవ‌కాశం మాత్రం ఫ్యాన్స్ మిస్ అయ్యారు. హిట్3 ఈవెంట్ లో విశ్వ‌క్ హిట్‌వ‌ర్స్ త‌న బిడ్డ‌గా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

హిట్‌వ‌ర్స్ లో విక్ర‌మ్ రుద్ర‌రాజు సాల్వ్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయ‌ని విశ్వ‌క్ చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తుంటే రాబోయే సినిమాల్లో విశ్వ‌క్ పాత్ర క‌న్ఫ‌ర్మ్ అని తెలుస్తోంది. హిట్3 ఇంట‌ర్వ్యూలో భాగంగా ఒక పార్ట్ లో అంద‌రినీ ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చే ఐడియా ఉంద‌ని, కానీ అది ఏ పార్ట్ లో చేస్తాడ‌నేది శైలేష్ కు మాత్ర‌మే తెలుస‌ని నాని చెప్ప‌డంతో హిట్ ఫ్రాంచైజ్ మూవీస్ లో భ‌విష్య‌త్తులో విశ్వ‌క్ క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ ఫిక్సైపోయారు.

లైలా సినిమాతో డిజాస్ట‌ర్ అందుకున్న విశ్వ‌క్ ఆ సినిమా త‌ర్వాత బ‌య‌ట క‌నిపించ‌డం బాగా త‌గ్గించేశాడు. ప్ర‌స్తుతం అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ఫంకీ మూవీ చేస్తున్న విశ్వ‌క్ ఆ సినిమాపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో విశ్వ‌క్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా క‌నిపిస్తాడ‌ని టాక్. ఫంకీ తో పాటూ విశ్వ‌క్ క‌ల్ట్ అనే మ‌రో మూవీలో కూడా న‌టించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ గురించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది.