Begin typing your search above and press return to search.

నాని.. మొదటి రోజే బ్లాస్ట్ చేసేలా ఉన్నాడు

నాని నటిస్తున్న ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా మే 1 థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 April 2025 6:29 AM
Nani HIT3 First Day Advance Collections
X

నాని నటిస్తున్న ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా మే 1 థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఎనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ యాక్షన్ థ్రిల్లర్ చుట్టూ భారీ హైప్ నడుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకోవడంతో, సినిమాపై అభిమానుల ఆసక్తి ఆకాశాన్ని తాకుతోంది. ఇక మొదటి రోజు ఆల్ ఇండియా తెలుగు షోలు 1,693 ఉండగా, ఇప్పటికే రూ.4.45 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోనే రూ.2.48 కోట్లతో దూసుకెళ్తోంది. ఈ నెంబర్లు సినిమా ఓపెనింగ్స్ ఎంత బలంగా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతున్నాయి. హైదరాబాద్‌లో బుకింగ్స్ 49.95% ఆక్యుపెన్సీతో ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదయ్యాయి. తెలంగాణలో రూ.3.26 కోట్ల గ్రాస్‌తో బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేవలం 182 షోలతో రూ.0.13 కోట్లు మాత్రమే వచ్చాయి.

ఏపీలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యంగా మొదలవడం దీనికి కారణం కావొచ్చు. అయినప్పటికీ, సినిమా విడుదల సమయానికి ఈ లెక్క పెరిగే అవకాశం ఉంది. నాని స్టార్‌డమ్, సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకం ఈ బజ్‌ను మరింత పెంచుతున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో నాని పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. రాష్ట్రాలు తిరిగి, ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ సీక్వెన్సెస్, సస్పెన్స్ ఎలిమెంట్స్ యూత్‌ని బాగా ఆకర్షిస్తున్నాయి. ‘A’ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా, ‘హిట్’ ఫ్రాంచైజ్‌లో మూడో చిత్రంగా భారీ అంచనాలతో రాబోతోంది. ఈ హైప్‌ను క్యాష్ చేసుకోవడానికి సరైన రిలీజ్ స్ట్రాటజీ చాలా ముఖ్యం. అయితే, ఏపీలో బుకింగ్స్ ఆలస్యం అభిమానులను కొంత నిరాశపరిచింది. గతంలో నాని సినిమాలైన ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’కి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ 4-5 రోజుల ముందు మొదలైతే, ప్రేక్షకులకు షో టైమ్స్, థియేటర్ ఎంచుకోవడం సులభంగా ఉంటుంది. ఇది ఓపెనింగ్స్‌ను మరింత బలంగా మారుస్తుంది. ట్రేడ్ వర్గాలు ‘హిట్ 3’ ఓపెనింగ్స్ గురించి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈమధ్య కాలంలో సాలీడ్ సినిమా పడలేదు. హైదరాబాద్, తెలంగాణలో బుకింగ్స్ ట్రెండ్ చూస్తే, సినిమా మొదటి వీకెండ్‌లో భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. ఏపీలో బుకింగ్స్ వేగం పెరిగితే, ఆల్ ఇండియా గ్రాస్ రూ.5 కోట్ల మార్క్‌ను అందుకోవచ్చని అంచనా.