Begin typing your search above and press return to search.

నెల‌కో హిట్ కావాలి..లేక‌పోతే క‌ష్టం!

ఒకేసారి ప్లాప్ ల్లా కాకుండా నెల‌కొ ఒక్క హిట్ అయినా ఇండ‌స్ట్రీకి అవ‌స‌ర‌మ‌ని ఆర్దిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 April 2025 11:57 AM IST
నెల‌కో హిట్ కావాలి..లేక‌పోతే క‌ష్టం!
X

ఏ ప‌రిశ్ర‌మనైనా ఇండ‌స్ట్రీ స‌క్సెస్ రేట్ ఒక్క‌టే నిల‌బెడుతుంది. దేశ వ్యాప్తంగా గుర్తింపు, పేరు కూడా కేవ‌లం స‌క్సెస్ తోనే సాధ్యం. అయితే ఆ స‌క్సెస్ కూడా ఎంతో బ్యాలెన్స్ గా ఉండాలి. ఒకేసారి హిట్లు.. ఒకేసారి ప్లాప్ ల్లా కాకుండా నెల‌కొ ఒక్క హిట్ అయినా ఇండ‌స్ట్రీకి అవ‌స‌ర‌మ‌ని ఆర్దిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా నెల‌కి ఒక‌టి ..రెండు విజ‌యాలు రావ‌డం వ‌ల్ల ప‌రిశ్ర‌మ మ‌రింత మెరుగ్గా ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ఒకేసారి హిట్ సినిమాలు రిలీజ్ అయితే వాట‌న్నింటిని పెరిగిన టికెట్ ధ‌ర‌ల‌తో సామాన్యుడు థియేట‌ర్ కి వ‌చ్చి చూసే అవ‌కాశం చాలా త‌క్కువ‌. అదే నెల‌కొ హిట్ సినిమా ప‌డితే కామ‌న్ ఆడియ‌న్ కి ఆ టికెట్ భారం అన్న‌ది అంతా ఉండ‌దు. కుటుంబ‌ స‌మేతంగా ఆ భారం ఎంతో త‌గ్గుతుంది. ప్రేక్ష‌కుడిపై సినిమా అనే ఇంపాక్ట్ కూడా అంత బ‌లంగా ఉండ‌దంటున్నారు. సినిమాలు చూసి యువ‌త చెడిపోతున్నారు? అనే అప‌వాదు ఇండ‌స్ట్రీపై ఉండ‌నే.

ఆ విమ‌ర్శ‌ను తొల‌గించుకునే అవ‌స‌రం కూడా ప‌రిశ్ర‌మ పై అంతే ఉంది. మ‌రి హిట్ కంటెంట్ ని రిలీజ్ విష‌యంలో బ్యాలెన్స్ చేయడం ఎలా అంటే? స్టార్ హీరోల సినిమాల‌న్నీ ఒకే సీజ‌న్..ఒకే నెల‌లో కాకుండా రిలీజ్ ల‌ను స్ప్లిట్ చేయాలంటున్నారు. సంక్రాంతి సీజ‌న్ ఉంద‌ని హీరోలంతా ఆ సీజ‌న్ లో రాకుండా రెండు సినిమాలు ఆ సీజ‌న్లో...ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి మిగ‌తా హీరోల సినిమాలు రిలీజ్ చేస్తే బాగుంటుందంటున్నారు.

ఇలా ఏడాది పొడ‌వునా? నెల‌కో స్టార్ హీరో సినిమా చొప్పున ఉండేలా చూడాలి. మ‌ధ్య‌లో టైర్ 2 హీరోలు.. ..యంగ్ హీరోలు కూడా ఉంటారు. కాబ‌ట్టి ఆ సినిమాల‌కు క్లాష్ కాకుండా స‌ర్దుబాటు చేయ‌గ‌లిగితే థియేట‌ర్ల స‌మ‌స్య కూడా ఉండ‌ద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇలా నెలొక‌కొ గ్యారెంటీ హిట్ పెట్టుకుని అదే నెల మ‌ధ్య‌లో టైర్ 2 స‌హా యంగ్ హీరోలు రిలీజ్ కు వ‌స్తే ఒక‌వేళ స్టార్ హీరో సినిమా అటు ఇటు అయినా? వెనకొచ్చిన వాళ్లు ఒక్క‌రైనా నిల‌బ‌డే అవ‌కాశం ఉంటుందంటున్నారు. కానీ ఇది ఏ ప‌రిశ్ర‌మ‌లోనూ అంత ఈజీగా అమ‌ల‌య్యేది కాదు.