కథలు లేకుండానే సీక్వెల్స్ చేసేస్తున్నాడు?
హిట్ 3 హిట్ కావడం, హిట్ 4లో కార్తీ హీరో అని డిక్లేర్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కార్తి 'హిట్ 4' ప్రాజెక్ట్‌పై పడింది.
By: Tupaki Desk | 3 May 2025 3:54 PMకొన్ని సినిమాలకు పక్కా స్క్రిప్ట్ ఉంటుంది. కొన్నింటికి స్క్రిప్టే ఉండదు. కాంబినేషన్‌ల కోసం కథలని సెట్‌లోనే వండేస్తూ సీన్‌లు తీస్తుంటారు. కొంత మంది దర్శకులైతే సెట్‌లోనే సీన్‌లు రాస్తూ అవే ఆన్ ది స్పాట్‌లో తీస్తుంటారు. ఇది ముమ్మాటికీ నిజం. ఈ విషయాన్ని ఆ మధ్య స్టేజ్‌పైనే మెగాస్టార్ చిరంజీవి వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ మాటల్ని అక్షరాలా నిజం చేస్తున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. యస్ 'హిట్' సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఈ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ ఇదే ఫ్రాంచైజీని కంటిన్యూ చేస్తున్న విషయం తెలిసిందే.
హిట్ తరువాత ఇదే తరహా క్రైమ్ థ్రిల్లర్ కథతో 'హిట్ 2'ని తెరకెక్కించారు. ఓ సైకో థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో అడివి శేష్ హీరోగా నటించాడు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అడివి శేష్ క్రేజ్ కూడా తోడవ్వడంతో రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.45 కోట్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. సీరియల్ కిల్లర్‌ని పట్టుకునే క్రమంలో హీరో కూడా అతడి ట్రాప్‌లో చిక్కే కథగా దీన్ని రూపొందించారు.
దీని ఎండింగ్‌లో అర్జున్ సర్కార్‌గా నాని ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. అయితే అప్పటికి శైలేష్ కొలను మైండ్‌లో హిట్ 3కి కథలేదు. కానీ 'హిట్ 2' ఎండింగ్‌లో చిన్న క్యామియో అంటూ నానిని దించేసి దర్శకుడు శైలేష్ కొలను ఎండ్ కార్డ్ వేశాడు. ఆ తరువాతే చిన్న పాయింట్ దొరకడంతో దాన్ని వండి వార్చి కథని చేసి 'హిట్ 3'ని రూపొందించాడు. ఇప్పుడు 'హిట్ 4' విషయంలోనూ ఇదే ఫార్ములాని వాడుతున్నాడట శైలేష్. 'హిట్ 3' ఎండింగ్‌లో హీరో కార్తి ఏసీపీ వీరప్పన్ పాండ్యన్‌గా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.
హిట్ 3 హిట్ కావడం, హిట్ 4లో కార్తీ హీరో అని డిక్లేర్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కార్తి 'హిట్ 4' ప్రాజెక్ట్‌పై పడింది. ఇప్పటి వరకు వచ్చిన మూడు ఫ్రాంచైజీలకు మించి హిట్ 4ని తెరపైకి తీసుకురానున్నారట. ఇదే విషయాన్ని శైలేష్ కొలను చెప్పి హైప్‌ని పెంచేస్తున్నాడు. అయితే హిట్ 4కు లైన్ మాత్రమే ఉందని, కథ మాత్రం లేదని తెలిసింది. లైన్ చెప్పి కార్తిని ఓకే చేయించుకున్న శైలేష్ కొలను ఇకపైనే కథని వండబోతున్నారట. దీంతో కథలు లేకుండానే సీక్వెల్స్ చేసేస్తున్నాడని శైలేష్‌పై కామెంట్‌లు వినిపిస్తున్నాయి.