Begin typing your search above and press return to search.

హిట్ యూనివర్స్ లో వాళ్లు కూడా..?

హిట్ 4 కార్తి చేస్తే కచ్చితంగా శైలేష్ నెక్స్ట్ ఫ్రాంచైజీలకు పైన చెప్పిన ప్రాసెస్ నే ఫాలో అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   9 May 2025 10:17 PM IST
హిట్ యూనివర్స్ లో వాళ్లు కూడా..?
X

శైలేష్ కొలను హిట్ ఫస్ట్ కేస్ తీసే టైం లో సీక్వెల్ గా కొన్ని కథలు తీయాలన్న ప్లాన్ ఇన్షియల్ గా ఉండి ఉండొచ్చేమో కానీ ఇది ఒక క్రేజీ యూనివర్స్ గా మారుతుందని మాత్రం ఊహించి ఉండరు. హిట్ ఫస్ట్ కేస్ విశ్వక్ సేన్ తో తీసి సక్సెస్ అందుకున్న శైలేష్ హిట్ 2 ని అడివి శేష్ తో తీసి హిట్ కొట్టాడు. అఫ్కోర్స్ ఇలాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలకు అడివి శేష్ పర్ఫెక్ట్ అని అందరు ఫీల్ అయ్యారు. హిట్ 2 తర్వాత హిట్ 3 నాని చేశాడు. అసలు నానిని అర్జున్ సర్కార్ లాంటి పాత్రలో చూస్తామని అనుకోలేదు. కానీ దాన్ని చేసి చూపించాడు.

హిట్ 3 తర్వాత హిట్ 4 హీరోని కూడా రివీల్ చేశాడు. కార్తికి నెక్స్ట్ సినిమా లైన్ చెప్పి ఒప్పించారా లేదా ఎలాగు హిట్ ఫ్రాంచైజీ మంచి క్రేజ్ వచ్చింది కదా ముందు క్యామియో చేయండి ఆ తర్వాత కథ నచ్చితేనే సినిమా చేయండని అన్నారా అన్నది తెలియదు కానీ హిట్ 3 చివర్లో కార్తి సర్ ప్రైజ్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చింది. హిట్ 3 వరకు మూడు సినిమాలు తెలుగు హీరోలతో చేసిన శైలేష్ హిట్ 4 కి తమిళ హీరోని దించుతున్నాడు.

ఈ లెక్కన చూస్తే హిట్ 5 కి దుల్కర్ సల్మాన్, హిట్ 6 కి కన్నడ స్టార్ ని ఎవరినైనా తీసుకునే ఛాన్స్ ఉంది. హిట్ 7 ని బాలీవుడ్ హీరోతో చేసి హిట్ యూనివర్స్ ఫైనల్ పార్ట్ ని ఈ హీరోలంతా కూడా ఒక ఆపరేషన్ కోసం కలిసి పనిచేసేలా కథ సిద్ధం చేస్తాడని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా హిట్ ఫ్రాంచైజీలకు ఈ క్రేజ్ సినిమా సినిమాకు పెరుగుతుంది.

హిట్ 4 కార్తి చేస్తే కచ్చితంగా శైలేష్ నెక్స్ట్ ఫ్రాంచైజీలకు పైన చెప్పిన ప్రాసెస్ నే ఫాలో అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఓ పక్క తమిళ్ హీరో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని డైరెక్టర్ గా తన మాస్ పంథా కొనసాగిస్తుంటే హిట్ యూనివర్స్ తో శైలేష్ ఒక అదిరిపోయే ఫ్రాంచైజీలు చేస్తున్నాడు. తప్పకుండా హిట్ ఫ్రాంచైజీలు సంథింగ్ స్పెషల్ గా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు.