ఫ్రాంఛైజీల్లో `హిట్` స్ట్రాటజీ వేరే లెవెల్
మిగతా ఫ్రాంఛైజీలకు, సీక్వెల్స్‌తో పోలిస్తే `హిట్` యూనివర్స్‌కున్న ప్రత్యేకతే వేరు. చాలా వరకు సీక్వెల్స్ రెండు లేదా మూడు పార్ట్స్ అవ్వగానే ఎండ్ కార్డ్ వేయాల్సిందే.
By: Tupaki Desk | 21 April 2025 9:00 PM ISTమిగతా ఫ్రాంఛైజీలకు, సీక్వెల్స్‌తో పోలిస్తే `హిట్` యూనివర్స్‌కున్న ప్రత్యేకతే వేరు. చాలా వరకు సీక్వెల్స్ రెండు లేదా మూడు పార్ట్స్ అవ్వగానే ఎండ్ కార్డ్ వేయాల్సిందే. పెద్దగా చెప్పడానికి, కంటిన్యూ చేయడానికి ఏమీ ఉండదు. ఆడియన్స్ కూడా బోర్ ఫీలవుతారు. కానీ హిట్ సిరీస్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఎందుకంటే ఇదొక డిఫరెంట్ జానర్ మూవీ ఫ్రాంఛైజీ. 2020లో ఫస్ట్ మూవీ `హిట్ ద ఫస్ట్ కేస్`ని విడుదల చేశారు. ఇందులో విశ్వక్‌సేన్ విక్రమ్ రుద్రరాజు అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో శైలేష్ కొలను రూపొందించగా నాని నిర్మించారు.
హిట్ సిరీస్‌లో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా విశ్వక్‌సేన్‌కు హీరోగా మంచి గుర్తింపుని అందించింది. హీరోగా విశ్వక్ మార్కెట్‌ని కూడా భారీగా పెంచేసి అతని కెరీర్‌లోనే డిఫరెంట్ ఫిల్మ్‌గా నిలిచింది. రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద రూ.11 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. దీని తరువాత ఇదే ఫ్రాంఛైజీని కొనసాగిస్తూ `హిట్ ద సెకండ్ కేస్` పేరుతో మరో సినిమా వచ్చింది. అడివి శేష్ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు.
మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించగా సైకో థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. రూ.15 కోట్లతో నిర్మిస్తే అడివి శేష్, నాని క్రేజ్ కారణంగా ఈ మూవీ రూ.42 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఎండింగ్‌లో `హిట్ ద థర్డ్ కేస్`కి సంబంధించిన విజువల్స్‌ని చూపించడం, ఇందులో నాని రూత్‌లెస్ కాప్ అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని క్లారిటీ ఇవ్వడంతో `హిట్ 3`పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇప్పటి వరకు విడుదలైన `హిట్ 3` ప్రచార చిత్రాలు సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేశాయి.
ఓవర్సీస్‌లో ఇప్పటికే రికార్డుల మోతమోగించడం మొదలు పెట్టిన ఈ సినిమా మే 1న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్న ఈ మూవీ ఎండింగ్‌లో హీరో కార్తి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంటే `హిట్ ఫోర్త్ కేస్`లో కార్తీ హీరోగా కనిపించనున్నాడన్నమాట. ఇదే యూనివర్స్‌లో నందమూరి బాలకృష్ణ కూడా కనిపించే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. మిగతా సిరీస్‌లకు హిట్ సిరీస్‌కున్న ప్రత్యేకత కారణంగా దీని ఫ్రాంఛైజీలు నిర్మాతగా నానికి, డైరెక్టర్‌గా శైలేష్ కొలనుకు బోర్ కొడితే తప్ప హిట్ ఫ్రాంఛైజీలకు బ్రేక్ పడే అవకాశమే లేదు. అంటే హిట్ ఫ్రాంఛైజీ నుంచి వరుసగా సిరీస్‌లు వస్తూనే ఉంటాయన్నమాట.
