కార్తీ వర్సెస్ దుల్కర్! 'హిట్ ది పోర్త్ కేస్' లో ఎవరు?
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న `హిట్ ది థర్డ్ కేస్` రిలీజ్ కి సమయం ఆసన్నమవుతోంది.
By: Tupaki Desk | 2 April 2025 4:26 PM ISTనేచురల్ స్టార్ నాని నటిస్తోన్న `హిట్ ది థర్డ్ కేస్` రిలీజ్ కి సమయం ఆసన్నమవుతోంది. మరో నెల రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. హిట్ 2 రిలీజ్ అయిన చాలా గ్యాప్ వచ్చినా థర్డ్ కేస్ విషయంలో బజ్ ఏమాత్రం తగ్గలేదు. అదే టెంపోతో చిత్రాన్నిపట్టాలెక్కించడం...ముగింపు దశ వరకూ వచ్చారు. ఈ సినిమా కి సంబంధించి ఇంకా ప్రచారం యాక్టివిటీస్ ఏవీ మొదలు కాలేదు. సినిమా గురించి పెద్దగా అప్ డేట్స్ కూడా మేకర్స్ ఇవ్వడం లేదు.
అయినా బజ్ ఏమాత్రం తగ్గలేదు. థ్రిల్లర్ ప్రియులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంచైజీ అన్ స్టాపబుల్ గా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. దీంతో `ఫోర్త్ కేస్` లో హీరో ఎవరు అవుతారు? అన్న ఆసక్తి అప్పుడే మొదలైపోయింది. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చే `ఫోర్త్ కేస్` హీరో ఎవరు? అంటూ అభిమానుల్లో అప్పుడే చర్చకు దారి తీస్తోంది. ఈనేపథ్యంలో ఇద్దరు హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
కోలీవుడ్ నటుడు కార్తీ..మాలీవుడ్ నటుడు దుల్కార్ సల్మాన్ పేర్లు వినిపిస్తున్నాయి. కొంత మంది కార్తీ నటిస్తున్నాడని...హిట్ ది థర్డ్ కేస్ క్లైమాక్స్లో నాని తరహాలో కార్తీ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. మరికొంత మంది ఆ ఛాన్స్ దుల్కర్ సల్మాన్ తీసుకున్నాడని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఫోర్త్ కేసులో పోలీస్ ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. కార్తీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు పెట్టింది పేరు.
వాటిలో అతడో బ్రాండ్. `కాఖీ`లో కార్తీ ఎలాంటి పెర్పార్మెన్స్ ఇచ్చాడో చెప్పాల్సిన పనిలేదు. `సర్దార్` లాంటి చిత్రంలోనూ కార్తీ గ్రేట్ పెర్పార్మెన్స్ ఇచ్చాడు. అలాగని దుల్కర్ సల్మాన్ తక్కువ కాదు. అతడో యూనిక్ పెర్పార్మర్. ఎలాంటి పాత్రలైనా అవలీలగా పోషించగలడు. ఈ నేపథ్యంలో `హిట్ ది ఫోర్త్ కేస్` లో ఛాన్స్ దుల్కర్ అందుకున్నా? ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.
