క్రైమ్ సంచలనం ఇన్వస్టిగేషన్ సాగిందిలా!
`హిట్` ప్రాంచైజీతో శైలేష్ కొలను క్రైమ్ థ్రిల్లర్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. హిట్ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన మూడు భాగాలు మంచి విజయాలు సాధించాయి.
By: Tupaki Desk | 4 May 2025 3:14 PM`హిట్` ప్రాంచైజీతో శైలేష్ కొలను క్రైమ్ థ్రిల్లర్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. హిట్ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన మూడు భాగాలు మంచి విజయాలు సాధించాయి. ఒక్కో పార్ట్ ఒక్కో కొత్త కేస్ ఇన్వ స్టిగేషన్ తో మొదలు పెట్టి ఇంట్రెస్టింగ్ గా ముగించడంతో హిట్ ప్రాంచైజీ ఓ బ్రాండ్ గా మారింది. రెగ్యులర్ క్రైమ్ చిత్రాలకు భిన్నంగా అతడి మేకింగ్ ఉండటం కలిసొస్తుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేయడంతోనే ఈ రేంజ్ సక్సెస్ అందుకున్నాడు.
ఈ క్రైమ్ ఇన్వస్టిగేషన్ లో శేలేష్ ఎంతో లోతైన విశ్లేషణ చేస్తున్నాడు. జరిగిన వాస్తవ సంఘటనలు ఆధా రంగా తీసుకుని తన మార్క్ స్టోరీ..స్క్రీన్ ప్లే సిద్దం చేసుకుని ఎక్కడా హీరో కనిపించకుండా స్క్రీన్ ప్లే తో నడిపించడం అతడికే చెల్లింది. తాజాగా రిలీజ్ అయిన `హిట్ 3` సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమా విషయంలో శేలేష్ స్టోరీ కోసం ఎలాంటి రీసెర్చ్ చేసాడు? అన్నది రివీల్ చేసాడు. `డార్క్ వెబ్ భారత్ ని పట్టి పీడిస్తుంది.
అందులో డీప్ వెబ్ కూడా ఉన్నాయి. అనైతిక, అమానుష కార్యకలాపాలు అందులో జరుగుతుంటాయి. దీని వెనుక నేరస్థుల్ని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ టీమ్ నిర్విరామంగా శ్రమిస్తుంది. హిట్ 3 కోసం ఏపీ , తెలంగాణ సైబర్ పోలీసలు ఎంతో సమాచారం అందించారు. డార్క్ వెబ్ వాటిలో జరుగుతున్న నేరాల గురించి ఎంతో విలువైన సమాచారం ఇచ్చారు. హిట్ 3లో చూపించిన దానికన్నా బయట అంతకన్నా ఘోరమైన దారుణాలు జరుగుతున్నాయి.
డార్క్ వెబ్ లో ఇలాంటి నేరాలకు పాల్పడే గ్రూపులు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని సైబర్ డిపార్ట్ మెంట్ కొన్ని మాత్రమే ఇచ్చింది` అని అన్నారు. మరి హిట్ ది పోర్త్ కేస్ విషయంలో శేలేష్ ఎలాంటి క్రైమ్ ని ఎంచుకున్నాడు? అన్నది చూడాలి. ఇందులో హీరోగా ఇప్పటికే కార్తీ నటిస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.