హిట్ 3 కి అక్కడ సూపర్ బూస్ట్..!
ఇది ఇలానే చెప్పాల్సిన కథ కాబట్టి నాని హిట్ 3 ని ఇలా తెరకెక్కించాడని చెప్పొచ్చు. ఐతే హిట్ 3 సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 16 April 2025 6:42 PM ISTన్యాచురల్ స్టార్ నాని శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న హిట్ 3 సినిమా మే 1న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ తో మరింత బజ్ పెరిగేలా చేశాడు నాని. ముఖ్యంగా నానిలోని ఈ ఊర మాస్ విధ్వంసం ఊహించని ఆడియన్స్ ఒక షాక్ లో ఉన్నారనే చెప్పొచ్చు. ఐతే ట్రైలర్ లో చూపించింది శాంపిలే అసలు బొమ్మ వెండితెర మీద చూస్తారుగా అని నాని ఊరిస్తున్నాడు. ఐతే ఈ సినిమా స్ట్రిక్ట్ గా చిన్న పిల్లలు చూడొద్దని చెబుతున్నాడు నాని. దానికి కారణం సినిమాలోని వైలెన్స్.
ఇది ఇలానే చెప్పాల్సిన కథ కాబట్టి నాని హిట్ 3 ని ఇలా తెరకెక్కించాడని చెప్పొచ్చు. ఐతే హిట్ 3 సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నాని వరుస సినిమాలతో సౌత్ లోనే కాదు నేషనల్ లెవెల్ లో మంచి మార్కెట్ సంపాదించాడు. ఈ క్రమంలో హిట్ 3 సినిమాకు అది కలిసి వచ్చేలా ఉంది. అందుకే హిట్ 3 ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు.
నాని ఈమధ్య సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబడుతున్నాయి. అందుకే నాని సినిమా అనగానే ఇతర భాషల్లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. హిట్ 3 తమిళ, కన్నడ, మలయాళంలో క్రేజ్ ఏర్పడింది. అందుకు తగినట్టుగానే మంచి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేరళలో నాని హిట్ 3 ని దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ ద్వారా రిలీజ్ చేస్తే తప్పకుండా మంచి రీచ్ ఉంటుందని చెప్పొచ్చు.
హిట్ 3 ప్రమోషన్స్ చూసిన మలయాళ డిస్ట్రిబ్యూటర్స్ నాని దగ్గరకు మంచి ఆఫర్ తోనే వచ్చినా ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ ద్వారా రిలీజ్ చేస్తే ఇంకాస్త రీచ్ ఉంటుందని భావించారు. అందుకే దుల్కర్ సల్మాన్ వేర్ ఫరెర్ ఫిలింస్ ద్వారా నాని హిట్ 3 కేరళ వెర్షన్ రిలీజ్ అవుతుంది. హిట్ 3 ప్రచార చిత్రాలన్నీ కూడా బ్లడ్ బాత్ అన్నట్టుగానే ఉన్నాయి.
నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ ప్రాజెక్ట్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. అంతకుముందు సైంధవ్ తో డిజాస్టర్ అందుకున్న ఈ డైరెక్టర్ కి నాని మరో ఛాన్స్ ఇవ్వడం అన్నది గొప్ప విషయం. ఆల్రెడీ హిట్ ఫ్రాంచైజీలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. హిట్ 1, 2 సక్సెస్ కాగా ఆ క్రేజ్ తోనే హిట్ 3 పై బజ్ ఉంది. ఐతే నాని బ్లడ్ బాత్ చూసిన ఆడియన్స్ ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. నాని హిట్ 3 విషయంలో సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి శైలేష్, నాని కాంబో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
