Begin typing your search above and press return to search.

హిట్ 3: నాని బుకింగ్స్ తోనే కిక్కిస్తున్నాడుగా..

ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి ఏర్పడింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, జనరల్ ఆడియన్స్ నుంచి కూడా సినిమాపై మంచి రెస్పాన్స్ వస్తోంది.

By:  Tupaki Desk   |   28 April 2025 3:31 PM IST
HIT 3 Advance Bookings
X

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన హిట్ 3 సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించారు. హిట్ యూనివర్స్‌లో మూడో భాగంగా వస్తున్న ఈ సినిమా మే 1న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్, ట్రైలర్‌లు, గ్లింప్స్‌తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ప్రత్యేకించి ఈసారి నాని చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. హిట్ 1, హిట్ 2 సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత, హిట్ 3ను మరింత భారీ స్థాయిలో తీసుకొచ్చారు. నాని సరికొత్త షేడ్స్ చూపించనున్న ఈ సినిమా, కథలో మలుపులతో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతోందని ట్రైలరే చెప్పేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి ఏర్పడింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, జనరల్ ఆడియన్స్ నుంచి కూడా సినిమాపై మంచి రెస్పాన్స్ వస్తోంది.

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం, హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి. యుఎస్‌లో మాత్రమే ప్రీమియర్ షోల ద్వారా ఇప్పటివరకు 2 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ సిటీలోనే తొలి రోజు బుకింగ్స్ 1.5 కోట్ల రూపాయలు దాటి పోయాయి. బుక్‌మైషోలో ఇప్పటికే 50 వేలకు పైగా టిక్కెట్లు సేల్ అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్ డే అడ్వాన్సులు సుమారు 5 కోట్ల రూపాయల దాకా నమోదయ్యాయని సమాచారం. ఇంకా అసలు ఫన్ను మిగిలే ఉంది. మే 1న రిలీజ్ నేపథ్యంలో, నేటి నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మాస్ సెంటర్స్, మల్టీప్లెక్స్‌లలో హిట్ 3కు భారీ ఓపెనింగ్ కనిపించేలా ట్రెండ్ కొనసాగుతోంది. తొలిరోజు వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా నాని కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన ప్రీ రిలీజ్ బజ్‌ని బట్టి చూస్తే హిట్ 3కు టాక్ నెగటివ్ కాకపోతే మినిమమ్ హిట్ అయితే ఖాయం అంటున్నారు విశ్లేషకులు. స్టోరీ, న్యారేషన్ పక్కాగా ఉంటే ఇది బాక్సాఫీస్ వద్ద మేజర్ సక్సెస్ అవ్వడం ఖాయం. ముఖ్యంగా నాని బ్లాక్‌బస్టర్ ట్రాక్‌లో మూడో విజయం కూడా ఖరారు కావొచ్చని అభిమానులు నమ్ముతున్నారు. మరి మే 1న హిట్ 3 ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.