Begin typing your search above and press return to search.

అభిమాన హీరోకి ఆయ‌న‌ ఘ‌న‌మైన నివాళి!

విజ‌య్ కాంత్ చిత్ర ప‌టానికి నివాళ్లు అర్పించ‌డానికి లారెన్స్ ఇంటికెళ్లిన‌ప్పుడు కుమారుడిని త‌న చేతుల్లో పెడుతున్నాని ప్రేమ‌ల‌త అన్నారు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 7:33 AM GMT
అభిమాన హీరోకి ఆయ‌న‌ ఘ‌న‌మైన నివాళి!
X

కెప్టెన్ విజ‌య్ కాంత్ అంటే రాఘ‌వ లారెన్స్ కి ఎంత ఇష్ట‌మో తెలిసిందే. లారెన్స్ అభిమాన హీరో అత‌ను. కెప్టెన్ మ‌ర‌ణంతో లారెన్స్ ఎంతగా చ‌లించిపోయాడో తెలిసిందే. ఇదే స‌మ‌యంలో త‌న‌పై ఉన్న అభిమానంతో కెప్టెన్ కుమారుడు సినిమాలో సైతం న‌టించడానికి రెడీగా ఉన్నానని ప్ర‌క‌టించాడు. విజ‌య్ కాంత్ చిత్ర ప‌టానికి నివాళ్లు అర్పించ‌డానికి లారెన్స్ ఇంటికెళ్లిన‌ప్పుడు కుమారుడిని త‌న చేతుల్లో పెడుతున్నాని ప్రేమ‌ల‌త అన్నారు.

ఆ స‌మ‌యంలోనే లారెన్స్ ఈ మాట ఇచ్చాడు. అయితే ఇప్పుడా మాట‌ను నిల‌బెట్టుకుంటున్నాడు. ప్ర‌స్తుతం విజ‌య్ కాంత్ కుమారుడు ష‌ణ్ముగ పాండియ‌న్ 'ప‌డై త‌లైవాన్' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో లారెన్స్ గెస్ట్ రోల్స్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కోసం ఆయ‌న మూడు రోజులు కాల్షీట్లు కేటాయించాడుట‌. అలాగే సినిమా విడుద‌ల స‌మ‌యంలోనూ త‌న‌వంతుగా ప్ర‌చార కార్య‌క్ర‌మా ల్లోనూ పాల్గొంటాన‌ని ప్రామిస్ చేసాడుట‌.

ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తుండ‌గా.. అన్బు అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నాడు. ఈసి నిమాలో లారెన్స్ ఎంట్రీ కొత్త హంగు తోడైంది. సినిమా మార్కెట్ కి ఆయ‌న ఎంట్రీ ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంది. కెప్టెన్ కిది లారెన్స్ అందించే ఘ‌న‌మైన నివాళి ఇది. మాట ఇచ్చి దాన్ని నిల‌బెట్టుకోవ‌డం అంత ఈజీ కాదు. ఎంతో అభిమానం ఉంటే త‌ప్ప మాట అన్న‌ది ఇవ్వ‌లేరు. కెప్టెన్ ని లారెన్స్ ఎంత‌గా ఆద‌రిస్తాడు? అన‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌.

ఇప్పుడా మాట‌ను నిల‌బెట్టుకుని కెప్టెన్ కుటుంబ స‌భ్యుల‌ మ‌న‌సుల్లో చిర స్థాయిగా నిలిచిపోతున్నాడు. ప్ర‌స్తుతం లారెన్స్ త‌న ప్రాజెక్ట్ ల్లో తాను బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా అత‌డికి స‌రైన విజ‌యాలు ప‌డ‌టం లేదు. ఆ మ‌ధ్య 'చంద్ర‌ముఖి' సినిమాతో భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొ చ్చినా నిరాశ త‌ప్ప‌లేదు. ప్ర‌స్తుతా లారెన్స్ కూడా స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. మ‌రి కెప్టెన్ త‌న‌యుడి సినిమా త‌న‌కేమైనా క‌లిసొస్తుందా? అన్న‌ది చూడాలి.