Begin typing your search above and press return to search.

ప్రియురాలిపై విరుచుకుప‌డ్డ గ్రీక్ గాడ్!

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ గాళ్ ఫ్రెండ్ సబా ఆజాద్ పాపుల‌ర్ గాయ‌ని అన్న సంగ‌తి తెలిసిందే. లైవ్ లో డ్యాన్సుల‌తో దుమారం రేపుతూ త‌న‌దైన గానంతో అల‌రించ‌డం ఈ భామ ప్ర‌త్యేక‌త‌.

By:  Tupaki Desk   |   11 Dec 2023 6:18 AM GMT
ప్రియురాలిపై విరుచుకుప‌డ్డ గ్రీక్ గాడ్!
X

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ గాళ్ ఫ్రెండ్ సబా ఆజాద్ పాపుల‌ర్ గాయ‌ని అన్న సంగ‌తి తెలిసిందే. లైవ్ లో డ్యాన్సుల‌తో దుమారం రేపుతూ త‌న‌దైన గానంతో అల‌రించ‌డం ఈ భామ ప్ర‌త్యేక‌త‌. ఇంత‌కుముందు సబా లైవ్ పెర్ఫామెన్సుల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాల్లో సంచ‌ల‌నంగా మారాయి. వాట‌న్నిటిపైనా హృతిక్ విధిగా ప్రేమ‌ను కురిపిస్తుంటారు. సబాపై ట్రోలింగ్ ని కూడా హృతిక్ ఖండిస్తుంటారు.


ఇప్పుడు మ‌రోసారి సాబా ఆజాద్ లైవ్ పెర్ఫామెన్సెస్.. గానంపై హృతిక్ త‌న‌దైన శైలిలో ల‌వ్ కురిపించాడు. వివ‌రాల్లోకి వెళితే.. అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్ నటించిన `ఖో గయే హమ్ కహాన్` ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ చిత్రం పూర్తి ఆల్బమ్‌ను మేకర్స్ రిలీజ్ చేసారు. సౌండ్‌ట్రాక్‌లో సబా ఆజాద్ పాడిన `ఐ వాన్నా సీ యు డాన్స్` అనే పాట ఉంది. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్‌లో సబా ఈ పాటను ప్రదర్శించింది. వేదిక‌పై డ్యాన్సుల‌తో హోరెత్తించింది. వెంట‌నే హృతిక్ రోషన్ ఈ వీడియోపై స్పందించారు. అతడి లేడీ లవ్ సబా పాడిన పాటపై విరుచుకుపడ్డారు.

ట్రైలర్ లాంచ్‌లో `ఐ వన్నా సీ యు..` డ్యాన్స్ ప్రదర్శన నుండి వీడియో క్లిప్‌లను షేర్ చేసిన‌ సబా ఆజాద్ ఇలా రాసారు. తుమ్ముల మధ్య ప్రదర్శన చేయడం మూసుకుపోయిన ముక్కుతో సరిపోతోంది... కానీ ఇప్పటికీ చాలా సరదాగా ఉంది! అని వ్యాఖ్యానించింది. జ‌లుబు తుమ్ముల‌తో ముక్కు మూసుకుపోయినా కానీ తాను గానాలాప‌న చేయ‌డం స‌ర‌దాగా ఉంద‌నేది స‌బా మీనింగ్. హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాన్ని మళ్లీ షేర్ చేసారు. స‌బా పాటపై ప్రేమను కురిపించారు. ఈ పాటను అతడు తిరిగి రాసాడు. దానికి రెడ్ హార్ట్ ఎమోజిని జోడించాడు. అయితే సోష‌ల్ మీడియాల్లో ఈ డ్యాన్సుల‌కు మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మైంది. కొంద‌రు త‌మ ల‌వ్ ని కురిపించ‌గా, మ‌రికొంద‌రు ఫ్యాన్స్ ప్ర‌తిసారీ అవే స్టెప్పులా సబా గ‌గ్గోలు పెట్టారు.

అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్ వేదికపై సబా ఆజాద్‌తో కలిసి ఈ వేగిక‌పై సంద‌డి చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. స్టార్లు కూడా ఈ వేదికపై సబా ఆజాద్‌తో కలిసి ఐ వాన్నా సీ యు డ్యాన్స్‌కు స్టెప్పులు క‌లిపారు. వారంతా తమ కూల్ మూవ్‌లతో మైమ‌రిపించారు. అభిమానులు ఈ గ్లింప్స్ ని క్యాచ్ చేసి ఆనందించారు. ఈ వేదిక‌పై సబా ఆజాద్ నలుపు రంగు కటౌట్ జంప్‌సూట్‌లో అందంగా కనిపించగా, అనన్య పాండే తెల్లటి మిడి దుస్తులు ధరించి క‌నిపించింది.

ఖో గయే హమ్ కహాన్ గురించి..

అనన్య, సిద్ధాంత్, ఆదర్శ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన `ఖో గయే హమ్ కహాన్` డిజిటల్ యుగంలో ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ సంబంధాలు, భావోద్వేగాలు లక్ష్యాల గురించి ఆవిష్క‌రించే మోడ్ర‌న్ డే డ్రామా చిత్రం. అర్జున్ వరైన్ సింగ్ అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ చిత్రానికి జోయా అక్తర్ - రీమా కగ్తీ సహ రచయితగా ఉన్నారు. టైగర్ బేబీ రీమా కగ్తీ, జోయా అక్తర్‌లతో కలిసి ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ దీనిని నిర్మించారు.