Begin typing your search above and press return to search.

హిరానీ సార్ ఇదేం లాజిక్?

కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. హిరానీ కెరీర్లో ఇదే వీకెస్ట్ ఫిలిం అనడంలో మరో మాట లేదు.

By:  Tupaki Desk   |   22 Dec 2023 5:51 AM GMT
హిరానీ సార్ ఇదేం లాజిక్?
X

దర్శకుడిగా చేసినవి అయితే చిత్రాలు. అయితేనేం అప్పుడే లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు రాజ్ కుమార్ హిరానీ. ఆయన తీసిన ఐదు సినిమాలూ కల్ట్ స్టేటస్ అందుకొని బ్లాక్ బస్టర్లు కావడంతో దర్శకుడుగా గొప్ప పేరే వచ్చింది. ఇలాంటి దర్శకుడు.. పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్లతో ఊపు మీద ఉన్న సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తో జట్టు కట్టడంతో డంకీ మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. హిరానీ కెరీర్లో ఇదే వీకెస్ట్ ఫిలిం అనడంలో మరో మాట లేదు. అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ చిత్రంలో ఆయన డీల్ చేసిన కాన్సెప్ట్.. మెజారిటీ ప్రేక్షకులకు అసలు మింగుడు పడనిది. సార్వజనీయమైన కాన్సెప్ట్స్ ఎంచుకుని అందరూ రిలేట్ చేసుకునేలా వాటిని డీల్ చేయడంలో చేయడంలో సిద్ధహస్తుడిగా హిరానికి పేరు ఉంది. కానీ డంకీలో అక్రమదారుల పట్ల సానుభూతి తెప్పించాలని, ఆ క్రమంలోనే ఎమోషన్లు పండించాలని హిరానీ చేసిన ప్రయత్నం ఫలించలేదు.

అక్రమ వలసదారుల వల్ల ప్రస్తుతం ప్రపంచ దేశాలు అనేకం ఇబ్బంది పడుతున్నాయి. అందులో మన ఇండియా కూడా ఉంది. బంగ్లాదేశ్ సహా పలు దేశాల నుంచి ఇండియాలోకి ఇల్లీగల్ గా వలసదారులు రావడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక యూరప్ దేశాలు అయితే మామూలు ఇబ్బందులు పడట్లేదు. అక్రమంగా దేశంలోకి వచ్చి స్థిరపడి, అక్కడి జనాలకి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ, ప్రభుత్వాలను శాసిస్తూ పెను సవాలు విసురుతున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. దీనివల్ల ఉగ్రవాదం కూడా పెచ్చుమీరుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్న తరుణంలో హిరాని ఇలాంటి కథను చెప్పడం రాంగ్ టైమింగ్. అసలు అక్రమ మార్గాల్లో వలసదారులు వివిధ దేశాల్లోకి చొరబడ్డం తప్పేమీ కాదని.. దేశాల బోర్డర్లన్నీ ఓపెన్ చేయాలని ఈ సినిమాలో హీరోతో చెప్పించడం ఆశ్చర్యం కలిగించే విషయం. వేరే దేశాల్లో నుంచి పక్షులు వస్తున్నాయి కదా మనుషులకు మాత్రం పరిమితులు ఎందుకు అని డైలాగ్ పెట్టడం మరీ విడ్డూరం. మేధావిగా పేరు ఉన్న హిరాని ఇంత ఇల్లాజికల్ గా కథ నడపడం ఆయన అభిమానులకే మింగుడు పడడం లేదు.