Begin typing your search above and press return to search.

హిరాణీ మార్క్ ట్రీట్ వ‌ర్క‌వుట‌వ్వ‌లేదు!

కానీ ఇప్పుడు ఆయ‌న మార్క్ మిస్స‌యింద‌నే విమ‌ర్శ ఎదుర‌వుతోంది. మోస్ట్ అవైటెడ్ హిరాణీ మూవీ డంకీ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఈ సినిమాపై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

By:  Tupaki Desk   |   22 Dec 2023 8:21 AM GMT
హిరాణీ మార్క్ ట్రీట్ వ‌ర్క‌వుట‌వ్వ‌లేదు!
X

సంజ‌య్ లీలా భ‌న్సాలీది ఒక శైలి. భ‌ట్స్ ది ఇంకో శైలి. మ‌ధుర్ భండార్క‌ర్ శైలి ఈ రెండిటికీ భిన్నం. కానీ వీళ్లంద‌రికంటే వైవిధ్యమైన‌ సినిమాలు తీయ‌డంలో రాజ్ కుమార్ హిరాణీ ట్యాలెంట్ గురించి ప్ర‌పంచ‌మంతా మాట్లాడుకుంటుంది. ద‌ర్శ‌కుడు హిరాణీలా ఒక్క సీన్ లేదా షాట్ ని కూడా తాను క్రియేట్ చేయ‌లేన‌ని ఎస్.ఎస్.రాజ‌మౌళి అంతటి వారే అంగీక‌రించారు. సున్నిత‌మైన ఉద్వేగాలను ఎంతో ఘాడంగా హ‌త్తుకునేలా తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో హిరాణీ సూక్ష్మాతి సూక్ష్మ‌మైన‌ ప‌నిత‌నం గొప్ప‌ది అని రాజ‌మౌళి కీర్తించారు.

కానీ ఇప్పుడు ఆయ‌న మార్క్ మిస్స‌యింద‌నే విమ‌ర్శ ఎదుర‌వుతోంది. మోస్ట్ అవైటెడ్ హిరాణీ మూవీ డంకీ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఈ సినిమాపై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇందులో భావోద్వేగాల‌ను వ‌ర్క‌వుట్ చేయ‌డంలో హిరాణీ ఫెయిల‌య్యాడ‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. హిరాణీ మార్క్ మిస్స‌యింద‌న్న పెద్ద విమ‌ర్శ వినిపించింది. నిజానికి ఇది ఊహించ‌నిది. డంకీ బలహీనమైన ఓపెనింగ్ లు నిరాశ‌ప‌రిచాయి. SRK వరుసగా ప‌ఠాన్- జవాన్ చిత్రాల‌తో బ్లాక్ బస్టర్లు అందుకుని దూకుడు మీద ఉన్నా అవేవీ హిరాణీ మూవీకి క‌లిసి రాలేదు. డంకీతో పోటీప‌డుతూ విడుద‌లైన సలార్ కి టికెట్ విండోలో భారీ డిమాండ్ నెల‌కొన‌గా, డంకీకి అడ్వాన్స్ బుకింగులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయ‌ని క‌థ‌నాలొచ్చాయి.

తొలి రోజు మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వడం కూడా డంకీ తిరోగ‌మ‌నానికి కార‌ణ‌మ‌వుతోంద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సినిమా వ‌సూళ్ల గురించి ఇప్పుడే మాట్లాడ‌డం స‌రికాదు. తొలి మూడు రోజుల్లో డంకీ చిత్రం ఏ మేర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో వేచి చూడాలి. హిరాణీ త‌న గ‌త చిత్రాల‌తో చేసిన మ్యాజిక్ ని డంకీతో రిపీట్ చేయ‌లేద‌న్నది అంద‌రూ అంగీక‌రిస్తున్న నిజం. హిరాణీ ఒక డ్రామా ఆధారిత క‌థ‌ను ఎంపిక చేసుకుని మంచి తారాగ‌ణాన్ని ఎంచుకున్నా, ఆశించిన‌ మ్యాజిక్ సాధ్య‌ప‌డ‌లేదు. డ‌ల్ ఓపెనింగుల‌తో ఈ చిత్రం నిరాశ‌పరిచింది.