Begin typing your search above and press return to search.

హిరాణీకి హిత‌వు ప‌లికి కింగ్ ఖాన్

అందుకే హిరాణీతో ఓ సంభాష‌ణ‌లో అస‌లు ప‌ఠాన్- జ‌వాన్ ల‌తో పోలిక చూడ‌వ‌ద్ద‌ని చెప్పాడు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 6:51 AM GMT
హిరాణీకి హిత‌వు ప‌లికి కింగ్ ఖాన్
X

రాజ్ కుమార్ హిరాణీ అంత‌టి దిగ్ధ‌ర్శ‌కుడికి ఒక‌రు హిత‌వు ప‌ల‌క‌డమా? కానీ.. ఇది నిజం! కింగ్ ఖాన్ షారూఖ్ అత‌డికి హిత‌వు ప‌లికాడు. అస‌లు ప‌ఠాన్, జ‌వాన్ క‌లెక్ష‌న్ల‌ను చూసి డంకీ విష‌యంలో అది ఆశించ‌వ‌ద్ద‌ని హిరాణీకే హిత‌వు ప‌లికాడు ఖాన్. ఇది ప‌రిమిత వ‌సూళ్ల సినిమా అవుతుంద‌ని ఖాన్ చాలా ముందే ఊహించాడు. అయితే కుటుంబ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట‌య్యే కంటెంట్ అని కూడా గ్ర‌హించాడు. అందుకే హిరాణీతో ఓ సంభాష‌ణ‌లో అస‌లు ప‌ఠాన్- జ‌వాన్ ల‌తో పోలిక చూడ‌వ‌ద్ద‌ని చెప్పాడు.

నిజానికి ప‌ఠాన్ - జ‌వాన్ చిత్రాలు భారీ యాక్ష‌న్ కంటెంట్ ఉన్న‌వి. ఈ త‌ర‌హా జాన‌ర్లు ఎక్కువ‌మంది ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించ‌గ‌ల‌వు. కానీ డంకీ ఒక సెక్ష‌న్ కి మాత్ర‌మే చెందిన‌ది అని ఖాన్ త‌న ద‌ర్శ‌కుడు హిరాణీతో అన్నారు. స‌లార్ లాంటి మాస్ యాక్ష‌న్ సినిమాతో పోటీప‌డుతూ రిలీజైన డంకీ త‌న జాన‌ర్ లో చెప్పుకోద‌గ్గ వ‌సూళ్ల‌ను సాధించింది.

అయితే 2023లో కింగ్ ఖాన్ షారూఖ్ హ్యాట్రిక్ కొట్టాడు. ప‌ఠాన్ - జ‌వాన్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద 1000 కోట్ల క్ల‌బ్ ల‌లో నిల‌వ‌గా డంకీ ఇప్ప‌టికే 350కోట్లు వ‌సూలు చేసి విజ‌య‌వంతంగా థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతోంది. ఈ సినిమా 500 కోట్ల క్ల‌బ్ లో చేరినా చేర‌క‌పోయినా ప‌ఠాన్- జ‌వాన్ రేంజు చూపించ‌క‌పోయినా ఇప్ప‌టికే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. కేవ‌లం 80 కోట్ల బ‌డ్జెట్ (పారితోషికాలు మిన‌హా) తో రూపొందించిన డంకీ క్లాస్ ఆడియెన్ కి చెందిన‌ది అని టాక్ వ‌చ్చింది. అందుకే స‌లార్ లాంటి మాస్ యాక్ష‌న్ సినిమా వ‌సూళ్ల ముందు త‌ల‌వొంచింది. కానీ అది టార్గెటెడ్ ఆడియెన్ కి రీచ్ అయింద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన త్రి ఇడియ‌ట్స్- పీకే- మున్నాభాయ్ ఎంబిబిఎస్- సంజు వంటి చిత్రాల‌తో పోలిస్తే డంకీ కొంత లోలెవ‌ల్ వ‌సూళ్ల‌తో స‌రిపెట్టుకుంది. కానీ డంకీ ఎలాంటి ఆడియెన్ కి రీచ్ అవుతుందో అత‌డికి అవ‌గాహ‌న ఉంది. షారూఖ్ కూడా దీనికి అంగీక‌రించారు.