Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న కాంబినేష‌న్ హ్యాట్రిక్ పై క‌న్నేసారా?

బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణీ బ్లాక్ బ‌స్ట‌ర్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న నుంచి సినిమా రావ‌డానికి మూడు నాలుగేళ్లు ప‌డుతుంది.

By:  Tupaki Desk   |   14 May 2025 1:00 PM IST
సంచ‌ల‌న కాంబినేష‌న్ హ్యాట్రిక్ పై క‌న్నేసారా?
X

బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణీ బ్లాక్ బ‌స్ట‌ర్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న నుంచి సినిమా రావ‌డానికి మూడు నాలుగేళ్లు ప‌డుతుంది. కానీ వ‌చ్చిందంటే? ఓ గొప్ప చిత్రంతోనే ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. గత సినిమా `డంకీ` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా ఆ సినిమా అంచ నాలను పూర్తి స్థాయిలో అందుకోలేక‌పోంది. మంచి సినిమాగా విమ‌ర్శ‌కుల ప్రశంస‌లు అందు కున్నా? ఆయ‌న రేంజ్ హిట్ చిత్రంగా క‌నిపించ‌లేదు.

అప్ప‌టి నుంచి హిరాణీ నుంచి కొత్త సినిమా ప్ర‌క‌ట‌న రాలేదు. దీంతో ఆ సినిమా న్యూస్ చెబుతారా? అని హిరాణీ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ్ కుమార్ హిరాణీ మ‌రోసారి బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ తో సినిమా చేసే దిశ‌గా అడుగు లు వేస్తున్నారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ రాబోతుంద‌ని వినిపిస్తుంది. స్టోరీ విష‌యంలో క్లారిటీ లేదు గానీ ఇద్ద‌రు మ‌ధ్య మాత్రం చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు హిరాణీ క‌న్ప‌మ్ చేసారు.

మూడు స్టోరీ లైన్ ల్ ల‌తో హిరాణీ మూవ్ అవుతున్నారు. కానీ అందులో ఏ స్టొరీ లో అమీర్ క‌నిపిస్తారు అన్న‌ది క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ఆయ‌న ఎలాంటి క‌థ తెచ్చ్చినా అమీర్ చేయ‌డానికి సిద్దంగా ఉంటారు. ఆయ‌న‌పై అమీర్ కు అంత న‌మ్మ‌కం. గ‌తంలో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన `3 ఇడియ‌ట్స్`, `పీకే` చిత్రాలు ఎలాంటి విజ‌యాలు సాధించాయో తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇద్ద‌రు చేతులు క‌ల‌ప‌లేదు.

అలాగే హిరాణీ ఆయ‌న పాత సినిమాల‌కు సీక్వెల్ చేసే ఆలోచ‌న‌లో కూడా ఉన్న‌ట్లు గతంలో వెల్ల‌డించారు. `మున్నాభాయ్` కి సీక్వెల్ ఆలోచ‌న ఉంది. ఆ క‌థ ప్ర‌ధ‌మార్ధం కూడా సిద్ద‌మైన‌ట్లు వెల్ల‌డించారు. ద్వితి యార్ధం నుంచే క‌లం క‌ద‌ల‌లేద‌న్నారు. మ‌రి తాజాగా అమీర్ తో కామెడీ ఎంట‌ర్ టైనర్ అయితే `పీకే2` అవుతుందా? అన్న ప్ర‌చారం మొద‌లైంది. అమీర్ తో ఏ సినిమా అయిన‌ప్ప‌టికీ వ‌చ్చే ఏడాది ఆ చిత్రాన్ని ప్రారంభించాల‌న్న‌ది ప్లాన్.