Begin typing your search above and press return to search.

'హాయ్ నాన్న' అసలు కథ.. ఇదే నిజమైతే..

ఇటీవల విడుదల చేసిన మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ మూవీ కి సంబంధించి తాజాగా ఓ విషయం బయట కు వచ్చింది.

By:  Tupaki Desk   |   15 July 2023 8:10 AM GMT
హాయ్ నాన్న అసలు కథ.. ఇదే నిజమైతే..
X

నేచురల్ స్టార్ నాని హీరో గా ఇటీవల దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. శ్రీ‌కాంత్ ఓదెల రూపొందించిన ఈ సినిమా హీరో గా నాని ని వంద కోట్ల క్ల‌బ్‌లో చేర్చింది. కాగా, నాని ఎప్పుడూ విభిన్న కథలతో ప్రేక్షకుల ను అలరించాల ని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన సరి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.

నాని న‌టిస్తున్న 30వ ప్రాజెక్ట్ ను వైరా ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న్ చెరుకూరి, విజ‌యేంద‌ర్‌ రెడ్డి తీగ‌ల నిర్మిస్తున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం అవుతున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ నేప‌థ్యంలో ఈ మూవీ ని తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయి లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'హాయ్ నాన్న‌' అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు.

ఇటీవల విడుదల చేసిన మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ మూవీ కి సంబంధించి తాజాగా ఓ విషయం బయట కు వచ్చింది. దాని ప్రకారం మూవీ స్టోరీ ఇదే అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. దాని ప్రకారం ఈ మూవీ లో మృణాల్ నానికి కూతురుగా కనిపిస్తుందట. నమ్మడానికి వింతగా ఉన్నా అదే నిజం అనే ప్రచారం జరుగుతోంది.

ఈ మూవీ లో నాని సైంటిస్ట్ గా కనిపిస్తాడట. ఇక ఆయన కూతురు మృణాల్ ఫ్యూచర్ నుంచి ప్రజెంట్ కి వచ్చేస్తుందట. ఆ సమయం లోనే ఆమె తన తండ్రిని కలుసుకుంటుంది. ఆయనతో పాటు ఎనిమిదేళ్ల వయసు లో ఉన్న చిన్నారి కూడా ఉంటుంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి నాని ఫ్యూచర్ కి వెళతాడని తెలుస్తుంది. అయితే, ఇదే సమయం లో ఆ తర్వాత నాని తన ఎనిమిదేళ్ల కూతురిని లేదంటే, 25ఏళ్ల కూతురి లో ఎవరో ఒకరిని మాత్రమే ఎంచుకోవలసి వస్తుందట. మరి ఎవరిని ఎంచుకుంటాడు? ఆ సమస్య ఎలా పరిష్కరిస్తాడు అనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. మరి ఈ కథలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

నిజంగా కథ ఇదే అయితే, రెండు వేర్వేరు దారుల్లో సినిమా పై అంచనాలు మారిపోతాయి. మృణాల్ ను ఇందు లో హీరోయిన్ అనుకుంటున్నారు. ఇక నాని లాంటి స్మార్ట్ హీరో కు ఆమెను కూతురు చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పలేము. చాలా మంది ఫ్యాన్స్ అయితే నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, హీరో, హీరోయిన్ అంటే రొమాన్స్ ని ఎవరైనా ఎక్స్ పెక్ట్ చేస్తారు.

కానీ, అలా కాకుండా హీరోయిన్ ని తీసుకువచ్చి కూతురి ని చేయడం ఏంటి అని చాలా మంది నిరాశ కు గురౌతున్నారు. ఒకవేళ దర్శకుడు ఆడియెన్స్ ను కట్టిపడేసే ఎమోషన్ ను కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే లెక్క వేరేలా ఇండవచ్చు. ఇదిలా ఉండగా, ఈ మూవీని తెలుగు తో పాటు ఈ చిత్రాన్ని త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.