Begin typing your search above and press return to search.

మన స్టార్స్‌ అంటే శివన్నకి ఎంతో అభిమానం..!

తాజాగా హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ కోసం బెంగళూరు వెళ్లిన నాని ని కూడా శివన్న కలవడం తో పాటు అక్కడ హాయ్ నాన్న సినిమా కు కావాల్సినంత ప్రమోషన్ ను శివన్న ఇవ్వడం జరిగింది.

By:  Tupaki Desk   |   5 Dec 2023 7:06 AM GMT
మన స్టార్స్‌ అంటే శివన్నకి ఎంతో అభిమానం..!
X

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ హీరోల మధ్య స్నేహ రాగం ఎక్కువగా వినిపిస్తోంది. అంతే కాకుండా ఇతర భాషల స్టార్స్ కూడా కొందరు మన స్టార్స్ తో సన్నిహిత్యంగా ఉంటున్నారు. వారితో కూడా మన వాళ్లు చాలా సన్నిహిత్యం ను కనబర్చుతూ ఉన్నారు. ముఖ్యంగా కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్ కుమార్‌ అలియాస్‌ శివన్న కి టాలీవుడ్‌ పై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


హైదరాబాద్‌ నుంచి ఏ స్టార్‌ బెంగళూరు వెళ్లినా కూడా శివన్న ని కలుస్తూ ఉండటం మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. తాజాగా హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ కోసం బెంగళూరు వెళ్లిన నాని ని కూడా శివన్న కలవడం తో పాటు అక్కడ హాయ్ నాన్న సినిమా కు కావాల్సినంత ప్రమోషన్ ను శివన్న ఇవ్వడం జరిగింది.

మీడియా సమావేశం కోసం వెళ్లిన నాని ని బ్రేక్‌ఫాస్ట్‌ కి పిలిచిన శివన్న 'హాయ్ నాన్న' సినిమా గురించి అడిగి తెలుసుకున్నాడు. తన టీమ్‌ తో హాయ్ నాన్న సినిమా కన్నడ వర్షన్ ను సాధ్యం అయినంత ఎక్కువ ప్రమోషన్ అయ్యేలా చూడాలంటూ కూడా చెప్పాడట.

మొత్తానికి మన స్టార్స్ అంటే శివరాజ్ కుమార్‌ ఇంత అభిమానం చూపిస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శివన్న మాదిరిగా మన స్టార్స్ కూడా ఇతర భాషల స్టార్స్ వచ్చిన సమయంలో, వారి సినిమాలకు ప్రమోషన్ విషయంలో సహాయం గా నిలవాల్సిన అవసరం ఉంది.

ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటే కచ్చితంగా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలు బాగుంటాయి. భాష అనే భావన లేకుండా అన్ని భాషల సినిమాలు కూడా అన్ని భాషల్లో మంచి వసూళ్లు నమోదు చేయడం జరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.