Begin typing your search above and press return to search.

నాని గాజుబొమ్మ… ప్రతి తండ్రి ఎమోషన్

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న మూవీ హాయ్ నాన్న. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడీగా నటిస్తోంది

By:  Tupaki Desk   |   6 Oct 2023 6:53 AM GMT
నాని గాజుబొమ్మ… ప్రతి తండ్రి ఎమోషన్
X

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న మూవీ హాయ్ నాన్న. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడీగా నటిస్తోంది. శౌర్యువ్ హాయ్ నాన్న చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తండ్రి, కూతుళ్ళ సెంటిమెంట్ తో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.


ఇప్పటికే హాయ్ నాన్న చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంది. హాసమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఖుషి తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వస్తోన్న రెండో సినిమా ఇదే కావడం విశేషం. మొదటి సాంగ్ హీరో, హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ పాట కాగా తాజాగా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. గాజుబొమ్మ అంటూ సాగే ఈ సాంగ్ లో తండ్రి, కూతుళ్ళ ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు.

కూతురు మీద ఓ తండ్రికి ఉన్న అవాజ్యమైన ప్రేమని ప్రతి లైన్ లో అనంత శ్రీరామ్ అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సాంగ్ ని అబ్దుల్ వాహబ్ ఆలపించి పాటకి ప్రాణం పోశారు. ది సోల్ ఆఫ్ ది హాయ్ నాన్న అనే థీమ్ తో ఈ సాంగ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. సాంగ్ అద్భుతంగా ఉండటంతో ప్రతి తండ్రి పిల్లల విషయంలో ఎలాంటి ఎమోషన్స్ తో ఉంటాడు అనేది సాంగ్ లో ఆవిష్కరించినట్లు ఉంది.

జెర్సీ తర్వాత నాని మరోసారి తండ్రి సెంటిమెంట్ ని ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మూవీపైన ఇప్పటికి వరకు సాంగ్స్, ఫస్ట్ గ్లింప్స్ తో పాజిటివ్ వైబ్ నడుస్తోంది. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే డేట్ విషయం ఇంకా క్లారిటీ రాలేదు. దసరా తర్వాత నాని ఖాతాలో హాయ్ నాన్న మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో మరో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతోంది. కూతురికి తండ్రి అయిన నానిని ప్రేమించే అమ్మాయిగా ఆమె పాత్ర ఉండబోతోంది.