Begin typing your search above and press return to search.

హాయ్ నాన్న.. రన్ టైమ్ ఎంత?

నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం హాయ్ నాన్న.

By:  Tupaki Desk   |   22 Nov 2023 5:11 AM GMT
హాయ్ నాన్న.. రన్ టైమ్ ఎంత?
X

నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం హాయ్ నాన్న. ఈ మూవీ డిసెంబర్ లో థియేటర్స్ లోకి రానుంచి. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ తో సిద్ధమైన ఈ మూవీ టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంది. కాస్తా సెంటిమెంట్, డ్రామాతో ఈ కథని కొత్త దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం నాని ఈ సినిమా ప్రమోషన్స్ పై గట్టిగా ఫోకస్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జనాలకి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ కూడా ప్రమోషన్స్ లో యాక్టివ్ గానే ఉన్నారు. కొత్త దర్శకుడు కావడంతో నాని తన భుజాలపై వేసుకొని సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

మూవీ రన్ టైం 2 గంటల 34 నిముషాలు ఉంటుందంట. ఇందులో సాంగ్స్ అన్ని కలిపి 12 వరకు ఉంటాయని తెలుస్తోంది. బిట్, థీమ్ సాంగ్స్, అలాగే హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్స్ తో కలిపి 12 వరకు డిజైన్ చేశారంట. ఖుషికి అద్భుతమైన సాంగ్స్ అందించిన మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ హేసమ్ అబ్దుల్ వాహబ్ హాయ్ నాన్నకి అద్భుతమైన సంగీతం అందించారంట.

కథలో భాగంగానే సాంగ్స్ అన్ని ఉంటాయని, కచ్చితంగా ఈ పాటలన్నీ ఆడియన్స్ ని మెప్పిస్తాయని చిత్రయూనిట్ బలంగా నమ్ముతోంది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో సాంగ్స్ భాగా తగ్గిపోయాయి. గతంలో ఆరు సాంగ్స్ వరకు ఉండేవి. ఇప్పుడు ఒకటి, రెండు సాంగ్స్ అవి కూడా కథ డిమాండ్ బట్టి పెడుతున్నారు. కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లు అయితే ఓ నాలుగు సాంగ్స్ వరకు ప్లాన్ చేస్తున్నారు.

కాని చాలా సంవత్సరాల తర్వాత ఏకంగా 12 సాంగ్స్ తో ఒక తెలుగు మూవీ రాబోతోంది. మరి ఈ సాంగ్స్ హాయ్ నాన్న సినిమా చూడగానికి వెళ్ళే ఆడియన్స్ ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తాయనేది వేచి చూడాలి