Begin typing your search above and press return to search.

యూఎస్​లో హాయ్ నాన్న జోరు.. మరో న్యూ రికార్డ్

దసరా సినిమా హిట్ తర్వాత ఇటీవలే హాయ్ నాన్నతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 9:51 AM GMT
యూఎస్​లో హాయ్ నాన్న జోరు.. మరో న్యూ రికార్డ్
X

నేచురల్​ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, ఎక్స్‌ప్రెషన్స్, లుక్స్ ఇలా అన్నింటిలో కూడా తనదైన మార్కును చూపిస్తున్నారు. ఓ వైపు సినిమాల విషయంలో ప్రయోగాలు చేస్తూ.. మరోవైపు మార్కెట్​ను పెంచుకుంటున్నారు. దసరా సినిమా హిట్ తర్వాత ఇటీవలే హాయ్ నాన్నతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కమర్షియల్ హిట్ అయిన ఈ సినిమా వసూళ్లు కూడా భారీగానే రాబడుతోంది.

తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్​లో హాయ్​ నాన్న చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా యూఎస్​లో 1.5 మిలియన్ల డాలర్లను వసూలు చేసిందట. నాని కెరీర్​లో యూఎస్​లో 1.5 మిలియన్ల డాలర్లు వసూలు చేసిన మూడో సినిమాగా హాయ్​ నాన్న నిలిచింది. ఇంతకుముందు నాని నటించిన జెర్సీ, దసరా మూవీలు 1.5 మిలియన్ల క్లబ్​లోకి చేరాయి.

ఇటీవలే ఈ సినిమా ప్రీ-ప్రమోషన్స్ కోసం హీరోహీరోయిన్లు నాని, మృణాల్ ఠాకూర్ అమెరికాలో సందడి చేశారు. డల్లాస్ సహా పలు ప్రాంతాల్లో హాయ్​ నాన్న ప్రదర్శితమవుతున్న థియేటర్లకు వెళ్లి ఫ్యాన్స్​తో ముచ్చటించారు. ఆ తర్వాత ఈ సినిమా వసూళ్లు యూఎస్​లో బాగా పెరిగాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదో రోజు ఈ సినిమాకు వసూళ్లు బాగానే వచ్చాయి. రెండు రాష్ట్రాలు కలిపి రూ.48 లక్షలు షేర్ వసూలు చేసిందట. ప్రపంచవ్యాప్తంగా రూ.75 లక్షలు వరకు రాబట్టినట్లు సమాచారం. అయితే డిసెంబర్ రెండో వారంలో కేవలం చిన్న సినిమాలే విడుదలవ్వడంతో వీకెండ్​లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తండ్రీకూతుర్ల సెంటిమెంట్​తో తెరకెక్కిన ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా టాలీవుడ్​కు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. వైరా ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై మోహన్ చెరుకూరి నిర్మించారు. హీరోయిన్​గా మృణాల్ ఠాకూర్.. బేబీ కియారా లీడ్ రోల్స్ చేశారు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు.

మరోవైపు, హాయ్ ​నాన్నతో హిట్ కొట్టిన నాని.. తన కొత్త సినిమా కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. పాన్​ ఇండియా మార్కెట్​ను టార్గెట్​ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మంచి డైరెక్టర్స్ కోసం ఎదురుచూస్తున్నారట. తెలుగు దర్శకులతో పాటు తమిళ డైరెక్టర్లు చెప్పిన కథలు వింటున్నారట. సీబీ చక్రవర్తితో సినిమా ఫిక్స్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఓకే అవ్వలేదని సినీ వర్గాల్లో టాక్. మరి నాని కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.