Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హిమజ ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందా? అసలే జరిగింది?

ఇదే విషయాన్ని నటి హిమజ కూడా కన్ఫర్మ్ చేశారు. చాలామందిలో ఉన్న అపార్థాలకు చెక్ పెట్టేందుకే తానీ వీడియో చేస్తున్నట్లు చెప్పారు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 4:29 AM GMT
బిగ్ బాస్ హిమజ ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందా? అసలే జరిగింది?
X

దీపావళి పండుగ రోజున బిగ్ బాస్ ఫేం కమ్ నటి హిమజ రేవ్ పార్టీలో పట్టుబడిందంటూ కొన్ని టీవీ చానళ్లు.. న్యూస్ యాప్స్ లో పెద్ద ఎత్తున వార్తలు రావటం.. ఇవి కాస్తా వైరల్ కావటం తెలిసిందే. ఇంతకూ నగర శివారులో జరిగిన రేవ్ పార్టీలో నటి హిమజతో పాటు.. మరికొందరు కూడా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అందులో నిజమెంత? ఇంతకూ అసలు రేవ్ పార్టీ జరిగిందా? లేదా? ఇంతకూ మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన కేసేంటి? లాంటి వివరాల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

వైరల్ అవుతున్నట్లుగా జరిగింది రేవ్ పార్టీ అయితే కాదు. అది ఉత్త పార్టీ. టెలికాస్ట్ అయిన వార్తల్లో మాదిరి ఈ పార్టీ జరిగింది నగర శివారులోని రిసార్టులో కాదు.. ఆమె ఇంట్లో. కొత్త ఇల్లు కట్టుకున్న నేపథ్యంలో దీపావళికి ముందు పార్టీ ఇచ్చారు. దీనికి పలువురు హాజరయ్యారు. కాకపోతే.. ఈ పార్టీలో పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేయటంతో.. ఆ వెంచర్ లోని వారు కొందరు కంప్లైంట్ చేయటంతో మహేశ్వరం పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పుడున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కిందకు తాజా పార్టీ వస్తుందని చెబుతున్నారు. పోలీసులు సోదాలు చేసే టైంలో పదకొండు మంది వరకు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికి అందులో నిజం లేదు. ఇదే విషయాన్ని నటి హిమజ కూడా కన్ఫర్మ్ చేశారు. చాలామందిలో ఉన్న అపార్థాలకు చెక్ పెట్టేందుకే తానీ వీడియో చేస్తున్నట్లు చెప్పారు.

తాను తన ఇంట్లో ఉన్నానని.. దీపావళి సందర్భంగా ఇంటి పనుల్లో బిజీగా ఉన్నానని.. ఇలాంటి వేళలోరేవ్ పార్టీ జరిగిందంటూ కొన్ని ప్రముఖ చానళ్లలో వార్తలు వచ్చాయని చెప్పారు. పోలీసులు వచ్చి.. వారి పని వారు చేశారని.. ఎన్నికల సందర్భంగా సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. తాను అరెస్టు అయినట్లుగా వార్తలు రావటంతో.. అలాంటి వాటిల్లో ఎలాంటి నిజం లేదన్న విషయాన్ని స్పష్టం చేసేందుకే తానీ వీడియో చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

కొత్త ఇల్లు కావటంతో.. ఇంటి పార్టీ.. దీపావళి పార్టీని ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా తాజా పార్టీ ఉండటంతో ఆ తరహాలో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. వీడియోలో హిమజ పేర్కొన్నట్లుగా ఆమెను పోలీసులు అరెస్టు చేయలేదు. కంప్లైంట్ లాడ్జ్ చేసి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కేసు మాత్రం నమోదైందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.