Begin typing your search above and press return to search.

భాషల వారీగా.. టాప్ ఇండస్ట్రీ హిట్స్ ఇవే

వాటిలో ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాలు చూసుకుంటే ఇలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   27 Aug 2023 4:36 AM GMT
భాషల వారీగా.. టాప్ ఇండస్ట్రీ హిట్స్ ఇవే
X

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. జెనరేషన్ మారుతున్న కొద్ది కథల శైలి మారుతోంది. అలాగే బడ్జెట్ పరిధులు కూడా పెరుగుతున్నాయి. ప్రేక్షకాదరణ కూడా సినిమాలకి పెరుగుతూ వస్తోంది. దీంతో ఏ మాత్రం కంటెంట్ లో కొత్తదనం ఉన్న సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. చిన్న సినిమాలు కూడా వంద కోట్ల కలెక్షన్స్ కి రీచ్ అవుతూ ఉండటం విశేషం.

ఈ మధ్య రిలీజ్ అయిన బేబీ సినిమా ఏకంగా 80 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇక స్టార్ హీరోల చిత్రాలైతే చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో ప్రధానంగా ఐదు భాషలలో ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు వస్తూ ఉంటాయి. హిందీతో పాటు సౌత్ ఇండియా నాలుగు భాషల సినిమాలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. వాటిలో ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాలు చూసుకుంటే ఇలా ఉన్నాయి.

హిందీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూవీగా పఠాన్ నిలిచింది. ఈ సినిమా వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దంగల్ మొదటిస్థానంలో ఉంటుంది. ఈ సినిమా చైనాలో అద్భుతంగా ఆడింది. దీంతో 2 వేల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. తరువాత బాహుబలి 2 టాలీవుడ్ హిండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ 19 వందల కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తెలుగులో కూడా హైయెస్ట్ గ్రాస్ మూవీ గా మాత్రం ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాలలో అత్యధిక వసూళ్లు సాధించి నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది.

తమిళ్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా రోబో 2.ఓ మూవీ ఉంది. జైలర్ ఆ సినిమా రికార్డుని అందుకోవడానికి అవకాశం ఉంది. అయితే అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. కన్నడంలో కాంతారా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అక్కడ కేజీఎఫ్ 2 రికార్డులని కాంతారా బ్రేక్ చేసింది ఓవరాల్ గా చూసుకుంటే కేజీఎఫ్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

మలయాళంలో ఈ ఏడాది వచ్చిన 2018 మూవీ అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ఇండస్ట్రీ హిట్ మూవీగా ఉంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఒక్క కేరళలోనే వంద కోట్ల మార్క్ ని దాటిన సినిమాగా ఈ మూవీ నిలిచింది. టోవినో థామస్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు.