క్లిక్ అయితే వసూళ్ల వర్షం.. 'కుబేర'తో వారికి ఊపిరి!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్స్ లో కుబేర మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 Jun 2025 5:30 AMకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్స్ లో కుబేర మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కుబేర మూవీ ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుంది. ఇటీవల సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. ప్రస్తుతం మేకర్స్.. సినిమాను ప్రమోట్ చేసే బిజీలో ఉన్నారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 20వ తేదీన గ్రాండ్ గా కుబేర రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వచ్చిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 12వ తేదీన హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉంది. జూన్ 27వ తేదీన కన్నప్ప విడుదల కానుంది. రెండూ పెద్ద మూవీలు కనుక.. కుబేర గట్టి పోటీ మధ్య రిలీజవుతుందని అంతా అనుకున్నారు.
అదే సమయంలో జూన్ నెల మొత్తం పాన్ ఇండియా చిత్రాలతో సందడి ఉంటుందనుకుంటే.. రీసెంట్ గా విడుదలైన కమల్ హాసన్ థగ్ లైఫ్ నిరాశపరిచింది. ఆ తర్వాత రిలీజ్ అవ్వాల్సిన వీరమల్లు వాయిదా పడింది. ఇప్పుడు కుబేరపైనే భారం వేశారు తెలుగు రాష్ట్రాలు ఎగ్జిబిటర్స్. సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
జూన్ అంతా థియేటర్స్ కళకళలాడుతాయని భావించిన వారికి థగ్ లైఫ్ తో అలా.. వీరమల్లుతో ఇలా షాక్ తగిలింది. అందుకే కుబేరతో ఊపిరి పీల్చుకుందామని చూస్తున్నారు. అయితే ఇప్పటికే కుబేరపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. సూపర్ బజ్ క్రియేట్ అయ్యి ఉంది. మూవీ సూపర్ హిట్ పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు.
రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. అందులో క్లియర్ గా రివీల్ చేసిన సినిమా స్టోరీ లైన్ మెప్పిస్తుంది. లీడ్ రోల్స్ కు ఉన్న క్రేజ్.. శేఖర్ కమ్ముల టాలెంట్.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. మూవీ నేపథ్యం.. అలా అన్ని అంశాలు కూడా ఆడియన్స్ ను ఫిదా చేశాయి. దీంతో కంటెంట్ బాగుంటుందని సినీ ప్రియులు అనుకుంటున్నారు. అయితే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్ల వర్షమే. మరేం జరుగుతుందో వేచి చూడాలి.