Begin typing your search above and press return to search.

హిడింబ..మెల్లగా ఎక్కేస్తోందిగా

హిడింబతో తనను తాను కంప్లీట్ గా కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు.

By:  Tupaki Desk   |   21 July 2023 2:49 PM GMT
హిడింబ..మెల్లగా ఎక్కేస్తోందిగా
X

అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం హిడింబ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. తాజాగా ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది. ఇప్పటి వరకు అశ్విన్ బాబు తన అన్న ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారిగది సిరీస్ ద్వారా మాత్రం పాపులర్ అయ్యాడు.

హిడింబతో తనను తాను కంప్లీట్ గా కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. దానికి తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా సినిమాలో దర్శకుడు టచ్ చేసిన పాయింట్ ప్రేక్షకులని ఎగ్జైటింగ్ గురి చేసే విధంగా ఉందని చెప్పాలి. సిటీలో జరిగే అమ్మాయిల కిడ్నాప్ కి ఆదిమజాతికి సంబంధం ఏంటి అనేది కథలో భాగంగా చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసే విధంగా చెప్పాడు.

అశ్విన్ బాబు ఈ మూవీ కాన్సెప్ట్ కి తగ్గట్లుగా తన బాడీ షేప్స్ మార్చుకొని యాక్షన్ హీరోగా కనిపించాడు. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లలో తనదైన శైలిలో మెప్పించాడు. ఇక నందిత శ్వేత పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రలో అయిన ఈ బ్యూటీ తన మార్క్ చూపిస్తుంది. సినిమాలో కమర్షియల్ యాంగిల్ లో చెప్పిన కూడా అనిల్ కన్నెగంటి ఎంచుకున్న లైన్ కొత్తగాఉండటంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.

ఓవరాల్ గా చూసుకుంటే మేకింగ్ పరంగా హై వెల్యూమ్ బడ్జెట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. అలాగే కంటెంట్ లో కూడా కొత్తదనం ఉంది. అనిల్ కన్నెగంటి దర్శకుడిగా ఎంచుకున్న ప్లాట్ ఈ మధ్యకాలంలో ఆడియన్స్ టెస్ట్ కి తగ్గట్లు ఉందని చెప్పొచ్చు.

మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. అశ్విన్ బాబు కెరియర్ లో హిడింబతో మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటాడా లేదా అనేది వెకెండ్ పూర్తయ్యేసరికి తెలిసిపోతుంది.