Begin typing your search above and press return to search.

కన్నడం లోకి హిడింబ.. లక్కీ ఛాన్స్

హిడింబ చిత్రాన్ని అదే టైటిల్ తో కన్నడం లో రిలీజ్ చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   25 July 2023 1:44 PM GMT
కన్నడం లోకి హిడింబ.. లక్కీ ఛాన్స్
X

అశ్విన్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం హిడింబ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం లో అశ్విన్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించారు. నందితా శ్వేత హీరోయిన్ గా చేసింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ గా వచ్చిన ఈ సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చింది. అయితే యాక్షన్ సీక్వెన్స్ బాగుండటంతో పాటు, కొన్ని థ్రిల్లింగ్ అంశాలు మూవీ లో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి.

అలాగే దర్శకుడు అనిల్ టచ్ చేసిన పాయింట్ కూడా కొత్తగా ఉండటంతో కలెక్షన్స్ పరంగా సినిమాకి బాగానే వస్తున్నాయి. అలాగే మూవీ ప్రొడక్షన్ వేల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు హిడింబ చిత్రాన్ని అదే టైటిల్ తో కన్నడం లో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా మూవీ కన్నడ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దండుపాళ్యం మేకర్స్ నుంచి వస్తోన్న సినిమా అనే బ్రాండ్ ని కన్నడనాట ఎస్టాబ్లిష్ చేస్తున్నారు.

కన్నడ ఇండస్ట్రీలో దండుపాళ్యం సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే హిడింబ కి కూడా కచ్చితంగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. సినిమా లో చిన్న చిన్న లోపాలు సరిచేసుకొని రిలీజ్ చేస్తే మాత్రం కచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఒక వేళ కన్నడ నాట హిడింబ సినిమాకి హిట్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా అది రికార్డ్ అని చెప్పాలి.

రాజుగారి గది సిరీస్ తర్వాత అశ్విన్ బాబు చాలా గ్యాప్ తీసుకొని హిడింబ సినిమా చేశారు. అనిల్ కన్నెగంటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. నరమాంస భక్షకులు అనే కాన్సెప్ట్ ని తీసుకొని మూవీ ని ప్రేక్షకులకి అందించారు. ఓవరాల్ గా ఈ సినిమాకి థియేటర్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.

నిర్మాతలకి మాత్రం లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల నుంచి మూవీకి మంచి స్పందన ఉంది. ఈ కారణంగానే ఇప్పుడు కన్నడం లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. మరి కన్నడ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ మేరకు ఆధరిస్తారనేది వేచి చూడాలి.