Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌..హ‌రి హ‌ర నుంచి స‌ర్ ప్రైజ్‌

సెప్టెంబ‌ర్ 2, శ‌నివారం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా బ‌ర్త్‌డే స్పెష‌ల్ స‌ర్ ప్రైజ్ అంటూ మేక‌ర్స్ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' నుంచి కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు.

By:  Tupaki Desk   |   2 Sep 2023 3:57 AM GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌..హ‌రి హ‌ర నుంచి స‌ర్ ప్రైజ్‌
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తొలి పీరియాడిక్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం.ర‌త్నం మ‌రో నిర్మాత ఏ.ద‌యాక‌ర్‌రావుతో క‌లిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు పూర్త‌వుతుందా? ఎప్నుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్‌ల‌ని మేక‌ర్స్ విడుద‌ల చేసి సినిమాపై మ‌రింత హైప్‌ని క్రియేట్ చేశారు. ప్ర‌చార చిత్రాలు, గ్లింప్స్ అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. సెప్టెంబ‌ర్ 2, శ‌నివారం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా బ‌ర్త్‌డే స్పెష‌ల్ స‌ర్ ప్రైజ్ అంటూ మేక‌ర్స్ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' నుంచి కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. అర్థ్ర‌రాత్రి 12:17 నిమిషాల‌కు స‌రికొత్త మోష‌న్‌ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. 'సంతోష‌క‌ర‌మైన రోజున మ‌న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు అసాధ‌ర‌ణ ధైర్య‌సాహ‌సాలు, ద‌య‌, అప‌రిమిత‌మైన క‌రుణ‌ను జ‌రుపుకుంటున్నాము' అని చిత్ర బృందం పేర్కొంది.

ఇప్ప‌టి వ‌ర‌కు క్లీన్ షేవ్..కోర మీసాల‌తో క‌నిపించిన ప‌వ‌న్ తాజా పోస్ట‌ర్‌లో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేష‌న్ డ్రెస్‌లో ఫెరోషియ‌స్‌గా ఓ పోరాట యోధుడిగా ప‌వ‌న్ క‌నిపిస్తున్న తీరు విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. అంతే కాకుండా ఈ పోస్ట‌ర్‌లో గుబురు గ‌డ్డం ప‌వ‌న్ మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌కు సంబంధించిన సీన్‌లోని ప‌వ‌న్ లుక్‌లా క‌నిపిస్తోంది. 17వ శ‌తాబ్దం నాటి మొఘల్ ఎంపైర్ నేప‌థ్యంలో కుతుబ్ షాహీల‌కు సంబంధించిన చారిత్ర‌క క‌థాంశంతో..మొఘ‌ల‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన రాబిన్ హుడ్ లాంటి ఓ పోరాట యోధుడి క‌థ‌తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.

రోష‌నార‌గా బాలీవుడ్ బ్యూటీ న‌ర్గీస్ ఫ‌క్రీ న‌టిస్తుండ‌గా ఔరంగ‌జేబు పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ న‌టిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. బుర్రా సాయి మాధ‌వ్ సంభాష‌ణ‌లు అందిస్తుండ‌గా ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే మిగ‌తా భాగం పూర్తి కానుంద‌ని, సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాతే ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి.