కాశీలో వీరమల్లు ఈవెంట్.. యూపీ సీఎం వస్తున్నారా?
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 6 July 2025 8:30 PMటాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. క్రిష జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఏం రత్నం భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.
పోరాట యోధుడు వీరమల్లు రోల్ లో పవన్ కనిపించనుండగా.. బాబీ డియోల్ విలన్ గా ఔరంగజేబు పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. నిధి అగర్వాల్, సత్యరాజ్, విక్రమ్ జీత్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న మూవీ.. జులై 24న రిలీజ్ కానుంది.
ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ, ముమ్మరం చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో మరికొద్ది రోజుల్లో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జులై 19వ తేదీన తిరుపతి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. అంతకుముందు 17వ తేదీన పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో మరో ఈవెంట్ ను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఆ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని ఇప్పడు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
అదే కనుక నిజమైతే.. నార్త్ లో హరి హర వీరమల్లు మూవీపై భారీ హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం. అయితే యోగి, పవన్.. ఒకే కూటమికి చెందిన వారు. బీజేపీ, జనసేన మిత్రపక్షాలు. ఉత్తరప్రదేశ్ తోపాటు బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో యోగికి, బీజేపీకి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి యోగి వస్తే.. వీరమల్లుకు హెల్ప్ అవుతుంది.
అదే సమయంలో హరిహర వీరమల్లు.. సనాతన ధర్మానికి చెందిన సినిమాలానే అనిపిస్తుంది. ఆ అంశం కూడా నార్త్ లోని సినీ ప్రియులను, బీజేపీ అనుచరులను ఆకర్షించవచ్చు. కాబట్టి అనేక విధాలుగా సీఎం యోగి హరిహర వీరమల్లు కార్యక్రమంలో పవన్ తో వేదికను పంచుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.