Begin typing your search above and press return to search.

వీర‌మ‌ల్లు రిలీజ్ తేదీ మెగాఫ్యాన్స్ కి ఓ సెంటిమెంట్!

అలా చిరంజీవి కెరీర్ లోనే 'ఇంద్ర' మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. 2002లో 'ఇంద్రం' రిలీజ్ అయింది.

By:  Tupaki Desk   |   23 Jun 2025 4:00 AM IST
వీర‌మ‌ల్లు రిలీజ్ తేదీ మెగాఫ్యాన్స్ కి ఓ సెంటిమెంట్!
X

ఎన్నో వాయిదాల అనంత‌రం 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' మ‌ళ్లీ కొత్త రిలీజ్ తేదీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. జులై 24న పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రి జులై 24 దేనికి ప్ర‌త్యేక‌త‌? ఆ తేదీ నిర్ణ‌యించ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం ఏదైనా ఉందా? అంటే ఉంద‌నే తెలుస్తోంది. ఏకంగా మెగా బ్లాస్టింగ్ జూలైగా హైలైట్ అవుతుంది. అవును ఇప్ప‌టి వ‌ర‌కూ జూలైలో రిలీజ్ అయిన చాలా సినిమాలు మెగా ఫ్యామిలీకి మంచి విక్ట‌రీను అందించినవే.

స‌రిగ్గా 23 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'ఇంద్ర' జూలై 22న రిలీజ్ అయింది. ఈ సినిమా అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో అప్ప‌టికే న‌ట‌సింహ బాల‌కృష్ణ ఓ బ్రాండ్గా మార్కెట్ లో హిట్లు అందుకుంటున్నారు. చిరంజీ వి కెరీర్ మాత్రం ప్లాప్ ల‌తో డౌన్ ఫాలో లో ఉంది. అదే స‌మ‌యంలో ఇంద్ర లో న‌టించారు చిరు. ఈ విజ‌యం తో చిరంజీవి ఒక్క‌సారిగా మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. బాలయ్య సీమ సినిమాల వ‌సూళ్లు అన్నిం టి రికార్డులు ఇంద్ర చెరిపేసింది.

అలా చిరంజీవి కెరీర్ లోనే 'ఇంద్ర' మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. 2002లో 'ఇంద్రం' రిలీజ్ అయింది. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన 'తొలిప్రేమ' కూడా 1998 జులై 24న రిలీజ్ అయింది. న‌టుడిగా ప‌వ‌న్ కెరీర్ అప్పుడే ఆరంభ‌మైంది. ఈ సినిమా ప‌వ‌న్ కెరీర్ లోనే భారీ విజ‌యం సాధించిన చిత్రంగా నిలిచింది. న‌టుడిగా ప‌వ‌న్ ని మ‌రో మెట్టు పైకి ఎక్కించిన చిత్రంగా నిలిచింది. అటుపై ఆ మ‌రుస‌టి ఏడాదే అంటే 1999లోనే ప‌వ‌న్ న‌టించిన 'త‌మ్ముడు' కూడా జులై 15న రిలీజ్ అయింది.

ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇలా వ‌రుస రెండు విజ‌యాలు ప‌వ‌న్ ఇమేజ్ ని తారా స్థాయికి చేర్చాయి. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన 'మ‌గ‌ధీర' కూడా 2009 జులై 31న రిలీజ్ అ యింది. ఈ సినిమా చ‌ర‌ణ్ ని ఏకంగా 100 కోట్ల క్ల‌బ్ లో కూర్చోబెట్టింది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన 'ఫిదా' కూడా 2017 జులై 21 న రిలీజ్ అయింది. ఈ సినిమా వ‌రుణ్ కెరీర్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇలా జూలై మాసం మెగా ఫ్యామిలీకి బాగా క‌లిసొచ్చింది.