కంటెంట్ గెలిచింది.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న 'హే బల్‌వంత్'
బాక్సాఫీస్ వద్ద ఈ మధ్యకాలంలో బ్రేక్ ఈవెన్ అనేది చాలామంది నిర్మాతలకు సవాల్‌గా మారిన పరిస్థితుల్లో, కంటెంట్‌పై నమ్మకంతో తెరకెక్కిన ఒక చిన్న సినిమా ఆ మైలురాయిని దాటి, ప్రత్యేకంగా నిలిచింది.
By: Sravani Lakshmi Srungarapu | 26 Feb 2026 5:31 PM ISTబాక్సాఫీస్ వద్ద ఈ మధ్యకాలంలో బ్రేక్ ఈవెన్ అనేది చాలామంది నిర్మాతలకు సవాల్‌గా మారిన పరిస్థితుల్లో, కంటెంట్‌పై నమ్మకంతో తెరకెక్కిన ఒక చిన్న సినిమా ఆ మైలురాయిని దాటి, ప్రత్యేకంగా నిలిచింది. అలాంటి అరుదైన విజయాన్ని అందుకుంది ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందుతున్న సుహాస్ నటించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ హే బల్‌వంత్ మూవీ. రిలీజైన కొద్ది రోజుల్లోనే పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ సినిమా, ఇప్పుడు అధికారికంగా బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలకు ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వినూత్నంగా నిర్వహించిన థాంక్యూ మీట్ ఫర్ బ్రేక్ ఈవెన్ డన్ ఈవెంట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా నిర్మాత బి. నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ, తమ బ్యానర్‌లో వచ్చిన మొదటి సక్సెస్ ఇదేనని ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూసిన అనుభవం తనకు మరింత సంతృప్తినిచ్చిందని చెప్పారు. మంచి కంటెంట్‌ను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ఇంకా చూడని వారు తప్పకుండా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరారు.
డైరెక్టర్ గోపీ అచ్చర మాట్లాడుతూ, ఈ సినిమాకు దేశీయంగా మాత్రమే కాకుండా యూఎస్‌లో కూడా మంచి ఆదరణ లభించిందని తెలిపారు. కథను నమ్మి కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానన్నారు.
హీరోయిన్ శివానీ నాగారం ఈ మూవీ సక్సెస్‌కు ప్రేక్షకులే ప్రధాన కారణమని కృతజ్ఞతలు తెలిపారు. తమ కంటెంట్‌ను ప్రేమించి, ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్తూ, టీమ్ అంతా ఎంతో కష్టపడ్డామని, ఆ కష్టం ఫలించిందన్నారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ, తన గత సినిమాల కలెక్షన్లు నిరాశపరిచిన సందర్భంలో ఈ సినిమా వసూళ్లు తనకు కొత్త ధైర్యం ఇచ్చాయని వెల్లడించారు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో వచ్చిన రెస్పాన్స్ సంతోషాన్ని కలిగించిందన్నారు. చాలా రోజుల తర్వాత తన సినిమాకి ఓటీటీ ద్వారా మంచి ఫ్యాన్సీ రేటు రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఈ సినిమాను సుమారు 10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించామని, థియేట్రికల్ కలెక్షన్స్‌తో పాటు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారా పెట్టుబడి మొత్తాన్ని రికవరీ చేసుకున్నామని వంశీ నందిపాటి తెలిపారు. త్వరలోనే లాభాల జోన్‌లోకి ప్రవేశిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొడ్యూసర్ మనీ రికవరీ అయితేనే సినిమా నిజమైన సక్సెస్ అనే విషయాన్ని ఈ సినిమా నిరూపించిందన్నారు. దర్శకుడు గోపీతో మరో ప్రాజెక్ట్ చేయనున్నట్టు కూడా ఆయన వెల్లడించారు.
అదే వేడుకలో నంది అవార్డులపై తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్లిన విషయంపై వంశీ నందిపాటి వివరణ ఇచ్చారు. అవార్డుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, చిన్నప్పటి నుంచే నంది అవార్డు అందుకోవాలనే కలతో సినీ పరిశ్రమలోకి వచ్చానని తెలిపారు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే క్షమించమని కోరారు వంశీ. మొత్తానికి హే బల్‌వంత్ సినిమా కంటెంట్‌తో పాటు కమర్షియల్ గా కూడా విజయాన్ని సాధించి, టీమ్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించింది. సుహాస్ హీరోగా, శివానీ నాగరం హీరోయిన్ గా గోపీ అచ్చర గోపీ అచ్చర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి నిర్మించగా, బన్నీ వాస్, వంశీ నందిపాటి ద్వయం నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
