Begin typing your search above and press return to search.

వెస్ట్‌ ఇండీస్‌ స్టార్‌ నోట 'జై బాలయ్య'

హెట్‌మైర్‌ నోట జై బాలయ్య నినాదం విని చాలా మంది నందమూరి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 July 2023 8:28 AM GMT
వెస్ట్‌ ఇండీస్‌ స్టార్‌ నోట జై బాలయ్య
X

నందమూరి బాలకృష్ణ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఏదో ఒక సమయంలో జై బాలయ్య అంటూ పలకడం కామన్‌ విషయం. ఇక ఈ మధ్య కాలం లో పబ్స్ లో జై బాలయ్య సాంగ్స్ పెట్టుకోవడం... జై బాలయ్య నినాదాలు చేయడం చాలా కామన్‌ విషయంగా మారింది.

బాలకృష్ణ ను జై బాలయ్య అంటూ తెలుగు వారు అనడం కామన్‌ విషయం. కానీ వెస్ట్‌ ఇండీస్ స్టార్‌ క్రికెటర్‌ హెట్‌మైర్‌ నోట జై బాలయ్య అంటూ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక పబ్ లో బాలయ్య అభిమానులు చివర కు హెట్‌మైర్‌ తో కూడా జై బాలయ్య అనిపించారు. ఆ వీడియో కాస్త వైరల్‌ అవుతోంది.

క్రికెటర్‌ గా కోట్లాది మంది అభిమానుల ను కలిగి ఉన్న హెట్‌మైర్‌ నోట జై బాలయ్య నినాదం విని చాలా మంది నందమూరి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా లో ప్రస్తుతం నందమూరి అభిమానులు తెగ హడావుడి చేస్తూ హెట్‌మైర్ వీడియోను షేర్‌ చేస్తున్నారు.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే వరుసగా అఖండ, వీర సింహా రెడ్డి సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మూడవ హిట్‌ కోసం భగవంత్ కేసరి సినిమా తో రాబోతున్నాడు. బాలయ్య హ్యాట్రిక్‌ కొట్టేనా చూడాలి. భగవంత్‌ కేసరి సినిమా తర్వాత బాలయ్య తన తదుపరి సినిమాను బాబీ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.