Begin typing your search above and press return to search.

అచ్చు గుద్దిన‌ట్టు ఖాన్‌ని దించేశాడు!

ఇక ఐశ్వ‌ర్యారాయ్ కుమార్తె ఆరాధ్య తాను విద్యార్థిగా ఉన్న ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన వార్షిక వేడుక‌లో పాల్గొంది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 8:16 AM GMT
అచ్చు గుద్దిన‌ట్టు ఖాన్‌ని దించేశాడు!
X

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ అత‌డి భార్య-డిజైనర్ గౌరీ ఖాన్ నిన్న సాయంత్రం ధీరూభాయి అంబానీ స్కూల్ వార్షిక వేడుక‌లో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అక్క‌డ వేదిక‌పై కింగ్ ఖాన్ చిన్న కుమారుడు అబ్ర‌మ్ ఖాన్ ప్ర‌ద‌ర్శ‌న సంచ‌ల‌నంగా మారింది. ఖాన్ చిన్న కుమారుడు ఎబిరామ్ త‌న తండ్రి ఐకానిక్ ఫోజ్ ని అచ్చు గుద్దిన‌ట్టు దించేశాడు. ఇక ఐశ్వ‌ర్యారాయ్ కుమార్తె ఆరాధ్య తాను విద్యార్థిగా ఉన్న ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన వార్షిక వేడుక‌లో పాల్గొంది. ప్ర‌స్తుతం అబ్రామ్ స్కిట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

అబ్‌రామ్ (ఎబి రామ్) తన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అతడు వేదిక‌పై డ్రామా సమయంలో షారూఖ్ సిగ్నేచ‌ర్ భంగిమ(చేతులు చాచి)ను ప్రదర్శించి త‌న‌ తల్లిదండ్రులు సహా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అబ్రామ్ వేదికపైకి వచ్చినప్పుడు కొంత పాత‌కాల‌పు దుస్తులను ధరించి క‌నిపించాడు. ఇంగ్లీషులో స్కిట్ నుండి కొన్ని డైలాగ్స్ చెబుతూ.. తన తోటి ప్రదర్శనకారులతో, ``గివ్ మి హగ్, ఐ లవ్ హగ్స్`` అని చెబుతాడు. దిల్‌వాలే దుల్హనియా జాయేంగే ట్యూన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంది. ఆ ఒక్క ఫోజ్ తో ఎబిరామ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఆ స‌మ‌యంలో వేదిక వ‌ద్ద ఉన్న తండ్రి షారూఖ్ ఆనందోత్సాహానికి అవ‌ధుల్లేవ్. పుత్రోత్సాహ‌మ్ము.. ఆ క‌ళ్ల‌లో మెరుపు రూపంలో కనిపించింది.

ఈ వీడియోలో షారూఖ్, గౌరీ ఖాన్, సుహానా ఖాన్ అబ్‌రామ్‌ని ఉత్సాహపరుస్తూ షో అంతటా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ కనిపించారు. సుహానా తన ఫోన్‌లో ఈవెంట్ ను రికార్డ్ చేసింది. ఇటీవలే ది ఆర్చీస్‌తో తన నటనా రంగ ప్రవేశం చేసిన సుహానా ఖాన్, సంప్రదాయ సూట్ సెట్‌ను ధరించి గ్లామర్‌ను వెదజల్లిన సంగ‌తి తెలిసిందే.

స్కూల్ వార్షికోత్స‌వ వేడుక‌కు చాలామంది ప్రముఖులు హాజర‌య్యారు. బాలీవుడ్ నుంచి ప్ర‌ముఖ స్టార్లు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ఖాన్ కుటుంబంతో పాటు, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ కూడా ఆరాధ్య బచ్చన్‌ను ఉత్సాహపరిచేందుకు వచ్చారు. మ్యూజిక‌ల్ డ్రామాలో ఆరాధ్య‌ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో, కరీనా కపూర్ ఖాన్, కరణ్ జోహార్ కూడా వారి పిల్లలైన తైమూర్ అలీ ఖాన్, యష్, రూహీకి మద్దతుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

షారుక్ ఖాన్ తన తదుపరి చిత్రం డంకీ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ , తాప్సీ పన్ను కూడా నటించారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది. డిసెంబ‌ర్ 22న స‌లార్ ఢీకొట్ట‌బోతోంది.