Begin typing your search above and press return to search.

కరెక్ట్ టైమ్‌ లో ఎంట్రీ ఇచ్చిన వహాబ్‌... ఫ్యూచర్‌ స్టార్‌

ఈ సమయంలో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హేశం అబ్దుల్ వహాబ్‌ కి మంచి స్కోప్‌ ఉంది

By:  Tupaki Desk   |   29 July 2023 5:38 AM GMT
కరెక్ట్ టైమ్‌ లో ఎంట్రీ ఇచ్చిన వహాబ్‌... ఫ్యూచర్‌ స్టార్‌
X

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో ఒక్కో సినిమాకు ముగ్గురు నలుగురు సంగీత దర్శకులు వర్క్‌ చేస్తున్నారు. కానీ సౌత్ సినిమాలకు మాత్రం మొత్తం సినిమా ఆల్బం ను ఒక్క సంగీత దర్శకుడు చేస్తున్నాడు. చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ఒక్కరిని మించిన సంగీత దర్శకులు చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు దాదాపుగా ఒక్క సంగీత దర్శకుడు ఉంటాడు.

స్టార్‌ హీరో సినిమా అనగానే థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్ అనే అభిప్రాయం ఉంటుంది. ఈ మధ్య కాలంలో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ వస్తున్నాడు. తెలుగు లో అనిరుధ్ కి అంతగా బ్రేక్ దక్కడం లేదు. థమన్‌.. దేవి శ్రీ ల పాటలు ప్రేక్షకులకు బోర్ కొట్టేసినట్లుగా అనిపిస్తున్నాయి. ఈ సమయంలో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హేశం అబ్దుల్ వహాబ్‌ కి మంచి స్కోప్‌ ఉంది.

ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తో పాటు నాని, శర్వానంద్ సినిమాలకు సంగీతాన్ని అందించే అవకాశం ను దక్కించుకున్న అబ్దుల్‌ వహాబ్‌ ముందు ముందు స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఖుషి సినిమా పాటలు బాగా వైరల్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

ఖుషి సినిమా సంగీత దర్శకుడి గురించి వాకబు చేయడం మొదలు పెట్టారు. నాని హాయ్ నాన్న సినిమా తో పాటు శర్వానంద్‌ సినిమాల ఆల్బం లు కూడా సక్సెస్ అయితే తప్పకుండా స్టార్ హీరోల సినిమాలకు ఈయన వాంటెడ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ లో ఒక మంచి సంగీత దర్శకుడు అవసరం ఉన్న సమయంలో వహాబ్ ఎంట్రీ ఇచ్చి మంచి పని చేశాడు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. సౌదీ కి చెందిన వహాబ్‌ 8 ఏళ్ల వయసులోనే పియానోతో సంగీత కళాకారుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. 2007 నుండి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

గత ఏడాది వచ్చిన హృదయం సినిమా తో వహాబ్ కి మంచి బ్రేక్ దక్కింది. అందుకే ప్రస్తుతం తెలుగు తో పాటు పలు భాషల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రాబోయే కాలంలో స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ గా పేరు దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.