Begin typing your search above and press return to search.

త‌మ‌న్నాను పెళ్లాడేదెపుడో చెప్పాడు!

అయితే పెళ్లి విష‌యంలో ప్ర‌తిసారీ స‌మాధానం దాట‌వేస్తుండ‌డం అభిమానుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 6:12 AM GMT
త‌మ‌న్నాను పెళ్లాడేదెపుడో చెప్పాడు!
X

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌తిభావంతుడైన‌ హిందీ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో డేటింగ్ లో ఉన్న‌ సంగతి తెలిసిందే. ఈ జంట ప్రేమాయ‌ణాన్ని ఇప్ప‌టికే అధికారికంగా ధృవీక‌రించారు. అయితే పెళ్లి విష‌యంలో ప్ర‌తిసారీ స‌మాధానం దాట‌వేస్తుండ‌డం అభిమానుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ అంద‌మైన జంట అధికారికంగా దేనినీ ప్ర‌క‌టించ‌క‌పోయినా, కొన్ని మీడియాల్లో పెళ్లి గురించి వ‌రుస క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.


తాజాగా విజ‌య్ వ‌ర్మ‌కు మ‌రోసారి త‌న పెళ్లి గురించి ప్ర‌శ్న ఎదురైంది. సోషల్ మీడియాలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఒక అభిమాని త‌మ‌న్నాతో పెళ్లి గురించి ప్ర‌శ్నించారు. మేన కోడ‌లా అని పిలుస్తూ.. విజ‌య్ చాలా హుషారుగా త‌న అభిమానికి సమాధానం ఇచ్చాడు.

అభిమాని ఏమ‌ని ప్ర‌శ్నించారంటే.. ''కబ్ షాదీ కర్రే??!!! (మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు) అని ప్ర‌శ్నించ‌గా... దానికి ప్రతిస్పందిస్తూ ''నా మేనకోడలు ఇప్పటికే అమ్మను ప్రశ్నలు అడుగుతోంది (రెడ్ ఎమోజితో పాటు).. నేను హైదరాబాద్‌లో కూడా ఈ ప్ర‌శ్న‌ విన్నాను'' అని ఛ‌మ‌త్క‌రించాడు. మొత్తానికి మ‌రోసారి త‌మ‌న్నాతో త‌న పెళ్లి గురించి విజ‌య్ తెలివిగా దాట‌వేసాడు. నిజానికి త‌మ‌న్నా భాటియా త్వరగా వివాహం చేసుకోవాలని తన తల్లిదండ్రుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్న‌ట్టు గ‌తంలో క‌థ‌నాలొచ్చాయి. పెళ్లి కార‌ణాల‌తో త‌మ‌న్నా భాటియా 'భోళా శంకర్' త‌ర్వాత వేరొక చిత్రానికి సంత‌కం చేయ‌లేద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ అవ‌న్నీ ఫేక్ అని తేలిపోయింది.

విజయ్ వర్మ త‌న కెరీర్ గురించి ఆలోచ‌న‌ల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. ఛాలెంజింగ్ పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుని న‌టించాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఏదైనా శృంగార ర‌స‌ పాత్రలో ఎప్పుడు కనిపిస్తారని అభిమాని ప్ర‌శ్నించ‌గా... త్వరలోనే.. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అప్పటి వరకు... జానేజాన్ రొమాన్స్‌ని ఆస్వాధించండి! అని అన్నాడు. కరీనా కపూర్ ఖాన్‌తో కలిసి సినిమాలోని స్టిల్ ని కూడా షేర్ చేసాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... విజయ్ వర్మ చివరిసారిగా సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన 'జానే జాన్‌'లో జైదీప్ అహ్లావత్, కరీనా కపూర్ ఖాన్‌లతో కలిసి కనిపించారు. ఇది ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'ఉల్ జలూల్ ఇష్క్‌'తో బిజీగా ఉన్నారు. టీమ్ ప్రస్తుతం పంజాబ్‌లోని అమృత్‌సర్ - పాటియాలా ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతోంది. విబు పూరి రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, ఫాతిమా సనా షేక్ , షరీబ్ హష్మీ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. 'ఉల్ జలూల్ ఇష్క్' స్టేజ్ 5 ప్రొడక్షన్ బ్యానర్‌పై విడుదల అవుతుంది. కరిష్మా కపూర్, సారా అలీ ఖాన్‌ల‌తో క‌లిసి 'మర్డర్ ముబారక్' చిత్రంలోను విజ‌య్ వ‌ర్మ‌ న‌టిస్తున్నారు.