Begin typing your search above and press return to search.

యష్ కోసం తెలుగు నిర్మాతల ఆరాటం..!

కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్నా సరే యష్ డైరెక్ట్ తెలుగు సినిమా ముహూర్తం బయట పడట్లేదు

By:  Tupaki Desk   |   19 Aug 2023 8:21 AM GMT
యష్ కోసం తెలుగు నిర్మాతల ఆరాటం..!
X

కన్నడ పరిశ్రమ రేంజ్ పెంచిన హీరో యష్ K.G.F తో సంచలనాలు సృష్టించాడు. ఆ సినిమా నుంచి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేలా ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ సినిమా బాటలో చాలా సినిమాలు కన్నడ సినిమా స్టామినా చూపించాయి. KGF 1, 2 రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలిచాయి. కె.జి.ఎఫ్ తో డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోగా హీరోగా యష్ కూడా భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్నాడు.

KGF చాప్టర్ 1, చాప్టర్ 2 రెండు సినిమాలతో నేషనల్ లెవెల్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు యష్. కె.జి.ఎఫ్ తర్వాత నెక్స్ట్ సినిమా కోసం కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడు యష్. కాంబినేషన్ సెట్ అయినా ఇంకా యష్ నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. అయితే కె.జి.ఎఫ్ తో వచ్చిన క్రేజ్ తో తెలుగులో కూడా యష్ కి స్టార్ రేంజ్ వచ్చింది. ఇక్కడ మేకర్స్ కూడా యష్ తో సినిమాలు చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా దిల్ రాజు యష్ తో ఒక పాన్ ఇండియా సినిమా ప్లానింగ్ లో ఉన్నారు.

కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్నా సరే యష్ డైరెక్ట్ తెలుగు సినిమా ముహూర్తం బయట పడట్లేదు. యష్ క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో తెలుగు దర్శక నిర్మాతలు ఉన్నారు. యష్ ఓకే అంటే చాలు కానీ ఇక్కడ రెండు మూడు ఆఫర్లు రెడీగా ఉన్నాయి. యష్ తో సినిమా అంటే పాన్ ఇండియా లో హంగామా షురూ అయినట్టే. మరోపక్క యష్ తో KGF 3 కూడా ఉంటుందని అంటున్నారు.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 1 ని పూర్తి చేసి సలార్ 2 గ్యాప్ లో కె.జి.ఎఫ్ 3 సిద్ధం చేస్తాడని తెలుస్తుంది. మరి యష్ నెక్స్ట్ సినిమా అదే అవుతుందా ఈ గ్యాప్ లో మరేదైనా సినిమా చేస్తాడా అన్నది చూడాలి. యష్ సినిమా కోసం నేషనల్ ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. యష్ తో సినిమా కోసం సౌత్ మేకర్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. మరి యష్ తన వేగాన్ని పెంచి వరుస సినిమాలు చేస్తే బెటర్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. క్రేజ్ ఉన్నప్పుడే అది క్యాష్ చేసుకునేలా వరుస సినిమాలు చేయాలి అయితే కె.జి.ఎఫ్ తో వచ్చిన ఈ ఇమేజ్ ని సరైన కథలతో సినిమాలు చేసి వరుస బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని యష్ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.