Begin typing your search above and press return to search.

డేట్స్‌ కుదర్లేదు... భలే కవర్‌ చేశావ్‌ భయ్యా!

తమిళ స్టార్‌ హీరో విశాల్‌ సక్సెస్‌ ఫ్లాప్స్‌ లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు

By:  Tupaki Desk   |   19 April 2024 4:39 AM GMT
డేట్స్‌ కుదర్లేదు... భలే కవర్‌ చేశావ్‌ భయ్యా!
X

తమిళ స్టార్‌ హీరో విశాల్‌ సక్సెస్‌ ఫ్లాప్స్‌ లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'రత్నం' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

ప్రతి హీరో, నటుడు ఏదో ఒక సమయంలో ఏదో కారణం వల్ల కొన్ని సినిమాలను వదులుకోవడం జరుగుతుంది. కొన్ని సినిమాలను కావాలని వదులుకుంటే, కొన్ని సినిమాలు డేట్లు లేక వదులుకున్న సందర్భాలు ఉంటాయి. విశాల్‌ కెరీర్‌ లో కూడా పలు సినిమాలను వదలుకున్నాడట.

అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు ఒకటి కాగా మరోటి తమిళ స్టార్‌ హీరో విజయ్ నటించిన లియో ఒకటి. 'వరుడు' సినిమాలో ఆర్య పోషించిన విలన్ పాత్రకు మొదట విశాల్‌ ను సంప్రదించారట. ఆ సమయంలో డేట్లు కుదరక పోవడంతో నేను చేయలేదు అంటూ విశాల్‌ చెప్పుకొచ్చాడు.

లియో సినిమాలో యాక్షన్ కింగ్‌ అర్జున్‌ పోషించిన విలన్‌ పాత్రను విశాల్‌ తో చేయించాలని దర్శకుడు చాలా ప్రయత్నించాడట. కానీ విశాల్‌ మాత్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. తాజా ఇంటర్వ్యూలో లియో విషయమై స్పందిస్తూ తాను ఆ సమయంలో డేట్లు కేటాయించలేక పోవడం వల్లే నో చెప్పాను అన్నాడు.

వరుడు మరియు లియో సినిమాల్లో విలన్‌ రోల్స్ ను పోషించే అవకాశం వచ్చినా కూడా డేట్లు కుదరలేదు అంటూ విశాల్‌ వాటికి నో చెప్పాను అన్నాడు. అయితే నెటిజన్స్ మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. విశాల్‌ కి విలన్‌ రోల్స్ నటించడం ఇష్టం లేక వాటికి నో చెప్పాడు, ఇప్పుడు డేట్లు లేక చేయలేదు అంటూ కవర్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి వరుడు మరియు లియో సినిమాలను విశాల్‌ చేయక పోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ జరగలేదు. ఆ రెండు సినిమాల్లో విలన్ రోల్స్ గురించి పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోలేదు. కనుక విశాల్‌ వాటిని చేయక పోవడమే మంచిది అయ్యిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.