Begin typing your search above and press return to search.

ధోని నిర్మాతగా ఎంత నష్టపోయారో అడగండి!

కోలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటుడు విశాల్

By:  Tupaki Desk   |   20 April 2024 4:38 AM GMT
ధోని నిర్మాతగా ఎంత నష్టపోయారో అడగండి!
X

కోలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటుడు విశాల్. విశాల్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించారు. వాటిలో కొన్ని కమర్షియల్ హిట్ కాగా మరికొన్ని డిజాస్టర్ అయ్యాయి. రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఇప్పటికి నిర్మాతగా తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల విశాల్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్న నిర్మాతలు కొంతకాలం సినిమాలు తీయడం ఆపేయాలని చెప్పారు.

ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విశాల్ చేసిన వ్యాఖ్యలని చాలా మంది తప్పు పట్టారు. నిర్మాతలు సినిమాలు తీయడం ఆపేస్తే సినిమా మీద బ్రతుకుతున్న ఎంతో మంది జీవితాలు రోడ్డున పడతాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. నేను అన్న మాటలని కొంతమంది కావాలని వివాదాస్పదంగా మార్చారని విశాల్ తెలిపారు.

గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో సక్సెస్ లకంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి. నిర్మాతలు కోట్లలో నష్టపోతున్నారు. చిన్న సినిమాలకి అయితే కనీస ఆదరణ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్ మళ్ళీ సెట్ అయ్యేంత వరకు చిన్న నిర్మాతలు సినిమాలు చేయకుండా ఉండటం బెటర్ అని తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు చెప్పారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.

కోట్ల రూపాయిలు పెట్టి నష్టపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వారే శ్రేయస్సు కోసమే నేను నా అభిప్రాయాన్ని చెప్పాను. ఎవరివైనా కష్టపడి సంపాదించిన డబ్బులే కదా. అదే ఉద్దేశ్యంతో మాట్లాడాను అని విశాల్ చెప్పుకొచ్చారు. సినిమా నిర్మాణం అనేది ఇప్పుడు చాలా భారంతో కూడుకున్న పని అందుకే ఇందులో ఉన్న ఆటుపోట్లు గురించి తెలిసి హెచ్చరిస్తున్నాను.

అందరికి ఇష్టమైన స్టార్ క్రికెటర్ ధోని సినిమా మీద ఇష్టంతో ప్రొడ్యూసర్ గా ఒక మూవీ చేశారు కదా. ఆ సినిమా (LGM) రిజల్ట్ ఏంటనేది అందరూ చూసారు. అలాగే ఆ మూవీతో వచ్చిన నష్టం ఎంత అనేది కూడా తెలుసుకుంటే వాస్తవం అర్ధమవుతుంది అని విశాల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఇక విశాల్ కామెంట్స్ పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కంటెంట్ బాగుంటే సినిమాలు చూస్తారని అది పెద్ద సినిమానా లేదంటే చిన్న సినిమానా.. అనే తేడాను ప్రేక్షకులు ఎన్నటికీ చూపించారని మరికొందరు అంటున్నారు. మరి విశాల్ చేసిన కామెంట్స్ పై నిర్మాతలు ఎవరైనా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.