Begin typing your search above and press return to search.

సీబీఐ సెన్సార్ కేసు.. విచారణలో విశాల్

హీరో విశాల్ ఈ ఏడాది మార్క్ ఆంటోనీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుని బౌన్స్ బ్యాక్ అయ్యాడు

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:33 PM GMT
సీబీఐ సెన్సార్ కేసు.. విచారణలో విశాల్
X

హీరో విశాల్ ఈ ఏడాది మార్క్ ఆంటోనీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుని బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమాను కూడా పాన్ రేంజ్ లో విడుదల చేయడానికి గట్టి ప్రయత్నం చేశారు. అయితే ఆ సినిమా తమిళంలో తప్పితే మిగతా భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొత్తానికి విశాల్ అయితే సొంత మార్కెట్ లో అయితే ఈ సినిమా ద్వారా పోయిన మార్కెట్ ని కూడా వెనక్కి తెచ్చుకున్నాడు.

వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న తరుణంలో విశాల్ కు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. అయితే ఆ సినిమా సక్సెస్ లో హ్యాపీగా ఉన్న విశాల్ కు ఇప్పుడు సిబిఐ ఒక విచారణ కోసం పిలిచింది. ఎందుకంటే విశాల్ ముంబై కి చెందిన CBFC పై ఆ మధ్య కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని తెలిసిందే. మార్క్ ఆంటోని సినిమాను హిందీలో విడుదల చేశారు.

అయితే ఆ సినిమా సెన్సార్ కు పంపించగా ముంబై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిికెషన్ కు విశాల్ లంచం ఇచ్చినట్లుగా క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా విడుదల చేస్తూ ఈ విషయాన్ని చెప్పడంతో అప్పుడు నేషనల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోయింది. వెంటనే ఆ సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలి అని సిబిఐ కి కూడా తెలియజేశాడు..

దీంతో విశాల్ ఆరోపణలను ఆధారంగా చేసుకుని సిబిఐ కేసు నమోదు చేసింది. మార్క్ ఆంటోనీ సినిమా సెన్సార్ కోసం ఆరు లక్షల వరకు లంచంగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని విశాల్ తెలియజేశాడు. స్క్రీనింగ్ కోసం మూడు లక్షలు అలాగే సర్టిఫికెట్ కోసం మరో మూడు లక్షలు లావాదేవీలు జరిగినట్లు కూడా విశాల్ వివరణ ఇవ్వడంతో విషయం చాలా సీరియస్ అయిపోయింది.

ఇక సిబిఐ అధికారు లు వెంటనే అందుకు కారణమైన వారిపై కేసు నమోదు చేశారు. అక్టోబర్ నెలలోనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణకు కూడా చేశారని వార్తలు వచ్చాయి. అనంతరం మళ్ళీ ఆ విషయం పై ఎలాంటి రియాక్షన్ రాలేదు. అందరూ మర్చిపోయిన తరుణంలో మళ్ళీ ఇప్పుడు విశాల్ చేసిన ట్వీట్ వల్ల వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు విశాల్ సీబీఐ విచారణలో పాల్గొనబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. తన జీవితంలో ఎప్పుడూ కూడా సీబీఐ చరణలో పాల్గొంటానని అనుకోలేదని తెలియజేశారు. మరి ఈ వ్యవహారంపై నెక్స్ట్ విశాల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.