Begin typing your search above and press return to search.

అమ్మాయితో రోడ్డుపై విశాల్.. ఇదో ట్రిక్కా?

ఈ మధ్యకాలంలో మీడియా ఎక్కువగా ఫోకస్ చేయాలని లేని గాసిప్స్ కూడా సెలబ్రిటీలే క్రియేట్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   26 Dec 2023 7:30 AM GMT
అమ్మాయితో రోడ్డుపై విశాల్.. ఇదో ట్రిక్కా?
X

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఈ ఏడాది మార్క్ అంటోనీ మూవీతో హిట్ కొట్టాడు. పీరియాడిక్ జోనర్ లో టైం మిషన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం విశాల్ హరి దర్శకత్వంలో కంప్లీట్ మాస్ యాక్షన్ తో రత్నం అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ భాషలలో ఈ సినిమా రెడీ అవుతోంది.

రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ తీజర్, ఫస్ట్ లుక్ తో విశాల్ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. యాక్షన్ అండ్ రివెంజ్ కథాంశంతో మూవీ ఉండబోతోదని టైటిల్ టీజర్ బట్టి తెలుస్తోంది. ఇక మూవీలో రౌడీ షీటర్ క్యారెక్టర్ లో విశాల్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో విశాల్ అప్పుడప్పుడు ఇంటరెస్టింగ్ గా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు.

ఈ మధ్యకాలంలో మీడియా ఎక్కువగా ఫోకస్ చేయాలని లేని గాసిప్స్ కూడా సెలబ్రిటీలే క్రియేట్ చేస్తున్నారు. ఈ గాసిప్స్ ద్వారా కావాలని మీడియా దృష్టిలో పడటం కొద్ది రోజులు తన గురించి మొత్తం సోషల్ మీడియాలో హడావిడి నడిచాక తీరిగ్గా దాని గురించి క్లారిటీ ఇవ్వడం చేస్తారు. కొంతమంది హీరోలు అయితే రోడ్డు మీద ప్రాంక్ లు చేస్తూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో డిఫరెంట్ ఫ్యాన్ గ్రూప్స్ నుంచి షేర్ చేస్తున్నారు.

ఈ వీడియోల వైరల్ కావడంతో సింపుల్ గా ప్రమోషన్ దొరుకుతుంది. ఇప్పుడు విశాల్ కూడా అలాంటి ప్రమోషన్స్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడా అనే డౌత్ వస్తోంది. ఈ వీడియో చూస్తే ఆ అదే అనిపిస్తుంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం విశాల్ ఓ అమ్మాయితో రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చాడు. అదే సమయంలో ఎవరో మీడియా వాళ్ళు కెమెరాలతో షూట్ చేస్తున్నారనే విధంగా కలరింగ్ ఇచ్చి షర్ట్ కప్పుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతోంది. వీడియో చూస్తున్న నెటిజన్లు మాత్రం విశాల్ తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ఈ రకమైన ట్రిక్ ప్లే చేసాడని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి విశాల్ కొత్తం మూవీ రత్నం ఏప్రిల్ లో రిలీజ్ అనుకుంటున్నారు. అలాంటిది ఈ టైంలో ఇలాంటి ప్రమోషన్ స్ట్రాటజీలు ప్లే చేయాల్సిన అవసరం ఉంటుందా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఈ వీడియో రియల్ లేదా ప్రాంక్ అనేది తెలియాలంటే విశాల్ రెస్పాండ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.