Begin typing your search above and press return to search.

హీరో విజయ్ పై చెప్పుతో దాడి.. ఇంత దారుణమా?

సినీ, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విజయ్ కాంత్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 12:52 PM GMT
హీరో విజయ్ పై చెప్పుతో దాడి.. ఇంత దారుణమా?
X

తమిళ సీనియర్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ అనారోగ్యం కారణంగా నిన్న మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మరణ వార్తతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. సినీ, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విజయ్ కాంత్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

తమిళ ఇండస్ట్రీ తో పాటు టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించారు. మరోవైపు తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ అగ్ర హీరో తలపతి విజయ్ కెప్టెన్ విజయ్ కాంత్ భౌతికకాయాన్ని సందర్శించారు. ఆయన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

విజయ్ కాంత్ పార్థివ దేహానికి నివాళులర్పించిన విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయ్ కాంత్ పార్థివ దేహాన్ని చూసి తలపతి ఎమోషనల్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దళపతి విజయ్ అక్కడికి రావడంతో అభిమానులు ఎగబడ్డారు. విజయ్ ని చుట్టుముట్టి కదలకుండా చేశారు. సెక్యూరిటీ ఎంత ఆపినా కూడా అభిమానులు ఏమాత్రం ఆగలేదు. విజయ్ ని చూసేందుకు ఎగబడ్డారు.

ఇంతలోనే ఎవరో విజయ్ పై చెప్పు విసిరేశారు. అయితే అది విజయ్ కి తగలకుండా కొద్దిలో మిస్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. కాగా విజయ్ పై చెప్పు విసిరేసిన అతను ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. అతను కావాలని చేశాడా? లేకపోతే అక్కడి గందర గోళంలో అలా జరిగిందా? అనేది తెలియదు కానీ ఆ వ్యక్తి విజయ్ పై చెప్పు విసిరేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.

దీనిపై తలపతి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. మరోవైపు కెప్టెన్ విజయ్ కాంత్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు. ఆయన పార్టీ అయినా DMDK ఆఫీస్ ముందే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో విజయ్ కాంత్ అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వం లాంచనాలతోనే విజయ్ కాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి.