Begin typing your search above and press return to search.

ఇక హీరోలు లేకుండానే షూటింగ్ లు పూర్తి చేసేస్తారా?

ఇక హీరోలు అందుబాటులో లేని స‌మ‌యంలోనే విఎఫ్ ఎక్స్ టెక్నాల‌జీని విరివిగానూ వాడేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 3:00 AM GMT
ఇక హీరోలు లేకుండానే  షూటింగ్ లు పూర్తి చేసేస్తారా?
X

సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఎన్నో వెసులు బాట్లు దొరుకుతోన్న సంగ‌తి తెలిసిందే. కొత్త‌గా అందుబాటులోకి వ‌చ్చిన ఏఐ టెక్నాల‌జీని మార్కెట్లో ఎలా వినియోగిస్తున్నారో చూస్తునే ఉన్నాం. ఇక విజువ‌ల్ ఎఫెక్స్ట్..గ్రాఫిక్స్ వంటివి సినిమా రంగంలో ఎంత ఉప‌యుక్తంగా ఉన్నాయో తెలిసిందే. విజువ‌ల్ ఎఫెక్స్ట్ తో తెర‌పై రియాల్టీనే చూపించ‌గ‌ల్గుతున్నారు. ఓ యాక్ష‌న్ స‌న్నివ‌శం వ‌స్తుందంటే దాని వెనుక విజువ‌ల్ ఎఫెక్ట్ ఉంటుంది.

వాస్త‌వంలో ఆన్ సెట్స్ లో ఆ యాక్ష‌న్ స‌న్నివేశం వెనుక బోలెడంత స‌రంజామా..టీమ్ ప‌నిచేస్తుంది. అదే స‌న్నివేశం తెర‌పై విజువ‌ల్ ఎఫెక్ట్ తో ఎంతో రియాల్టీ లో చూపిస్తుంది. ఇక వ‌య‌సైపోయిన హీరోల్ని యంగ్ లోకి తీసుకురావ‌డానికి.. కుర్ర హీరోల్ని వ‌య‌సు మ‌ళ్లిన ముస‌లి పాత్ర‌లో హైలైట్ చేయ‌డానికి..న‌టీన‌టుల రూపం మార్చ‌డం కోసం ఇలా ప్ర‌తీచోట గ్రాఫిక్స్ ..విఎఫ్ ఎక్స్ లాంటివి ఫాంటసీ స్పేస్లో కీల‌కంగా మారాయి.

`జైల‌ర్` సినిమాలో ర‌జ‌నీకాంత్ ని సూప‌ర్ యాక్ష‌న్ హీరోగా క‌నిపించారంటే? అందుకు ఆయ‌న ఓ విప‌రీతంగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసారని కాదు. అదంతా విఎఫ్ ఎక్స్ మాయా జాలంలో క్రియేట్ చేసిన వండ‌ర్. ఆయ‌న ఫీచ‌ర్స్...స్టైల్ ని విఎఫ్ ఎక్స్ లో క్యాప్చ‌ర్ చేసి షూట్ చేసారంతే. ఇక హీరోలు అందుబాటులో లేని స‌మ‌యంలోనే విఎఫ్ ఎక్స్ టెక్నాల‌జీని విరివిగానూ వాడేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓ డైరెక్ట‌ర్ స్టార్ హీరో లేకుండా రెండు సన్నివేశాలను చిత్రీక‌రించారుట‌.

విజువల్ ఎఫెక్ట్స్‌తో లాంగ్ షాట్‌లను రూపొందించగా, అతని ఓవర్-ది-షోల్డర్ ప్రెజెన్స్ అవసరమయ్యే సన్నివేశాలను చిత్రీకరించడానికి వారు బాడీ డబుల్‌ని ఉప‌యోగించార‌ని తెలుస్తోంది. షూటింగ్ కి ఆ హీరో ఎందుకు అందుబాటులో లేడు అన్న‌ది తెలియ‌దు గానీ..ఇలా విఎఫ్ ఎక్స్ తో హీరో లేకుండానే షూటింగ్ చేయ‌డం అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక‌పై హీరోలు లేకుండా సినిమా షూటింగ్ లు చేసుకోవ‌చ్చు! కేవ‌లం హీరో అనుమ‌తి ఇస్తే చాలు అన్న‌ట్లే స‌న్నివేశం క‌నిపిస్తుంది.

హీరో నుంచి కొన్ని ర‌కాల పీచ‌ర్స్ ని క్యాప్చ‌ర్ చేసుకుంటే చాలు. వాటిని ఎంచ‌క్కా బాడీ డ‌బుల్ డ‌బుల్ వినియోగించి షూటింగ్ పూర్తిచేసేయోచ్చు. స‌రిగ్గా ఇదే టెక్నాల‌జీ ఉప‌యోగించి `రాధేశ్యామ్` లో హీరోయిన్ పూజా హెగ్డేకి సంబంధించిన స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఆమె డేట్లు కార‌ణంగా ఇబ్బందులు ఎదురైన స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు ఇదే టెక్నాల‌జీతో ఆమె పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్తిచేసిన‌ట్లు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ సినిమా డైరెక్ట‌ర్ హీరో యాక్షన్ స‌న్నివేశాల‌తో బాగా అల‌సి పోయి ఉండ‌టంతో కావాల‌నే విశ్రాంతి ఇచ్చిన‌ట్లు..ఈ నేప‌థ్యంలో విఎఫ్ ఎక్స్ కొన్ని షాట్ లు తీసినట్లు తెలుస్తోంది.