Begin typing your search above and press return to search.

అప్పుడే న్యూ ఇయ‌ర్ మొద‌లు పెట్టేసారా?

ఇక నేడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా దుబాయ్ బ‌య‌ల్దేరిన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీతో పాటు ఈ రోజు ఉద‌య‌మే ప్లైట్ ఎక్కేసారు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 11:38 AM GMT
అప్పుడే న్యూ ఇయ‌ర్ మొద‌లు పెట్టేసారా?
X

టాలీవుడ్ స్టార్ హీరోలు న్యూ ఇయ‌ర్ వేడుక‌లు అప్పుడే మొద‌లు పెట్టేసారా? రెండు ..మూడు రోజులు ముందుగానే ప్రీ సెల‌బ్రేష‌న్స్ షురూ చేసేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇప్ప‌టికే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో దుబాయ్ వెకేష‌న్ కి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. దేవ‌ర షూటింగ్ తో బిజీగా గ‌డిపిన తార‌క్ ఒక్క‌సారిగా ఫ్యామిలీ కోసం ప్లైట్ ఎక్కేసాడు. అక్క‌డ గ్రాండ్ గా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు సెల‌బ్రేట్ చేసుకుని..ఇంకొన్ని రోజులు విరామం తీసుకుని తిరిగి రానున్నారు.

ఇక నేడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా దుబాయ్ బ‌య‌ల్దేరిన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీతో పాటు ఈ రోజు ఉద‌య‌మే ప్లైట్ ఎక్కేసారు. గుంటూరు కారం షూటింగ్ కూడా పూర్తి చేయ‌డంతో రిలాక్స్ వేడుక‌ల్ని ఎంజాయ్ చేయాల‌ని ఆ ఫ్యామిలీ ప్లాన్ చేసుకుని వెళ్లింది. తిరిగొచ్చిన త‌ర్వాత మ‌ళ్లీ డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లు పెడ‌తారు. అయితే తార‌క్- మ‌హేష్ దుబాయ్ వెళ్ల‌డం వెనుక ఇంకేదైనా ప్లానింగ్ ఉందా? అన్న‌ది తెలియాలి.

దుబాయ్ లో ఆ రెండు కుటుంబాలు ప్ర‌త్యేకంగా న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ప్లాన్ చేసారా? అన్న‌ది తెలియాలి. ఇక దుబాయ్ లో ఇంకా మ‌హేష్ స‌న్నిహితులు..స్నేహితులు పార్టీలో జాయిన్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. గ‌తేడాది ఇలాగా వేడుక‌లు నిర్వ‌హించారు. ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటి? అన్న‌ది ఇంకా తెలియ‌లేదు. ఈ ఏడాది చ‌ర‌ణ్ -ఉపాసన దంప‌తుల‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైన సంవ‌త్స‌రం. క్లీంకార వాళ్ల జీవితాల్లోకి వ‌చ్చిన ఏడాది. కాబ‌ట్టి న్యూ ఇయ‌ర్ వేడుక‌లు స‌హా ...కొత్త సంవత్స‌రానికి గ్రాండ్ గా వెల్క‌మ్ చెప్పే పెద్ద ప్లానింగ్ ఉండే ఉంటుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలుస్తోంది.

అయితే ఇంత‌వ‌ర‌కూ చ‌ర‌ణ్ ప్లైట్ కి ఎక్కింది లేదు. హైద‌రాబాద్ లోనే ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డే కుటుంబంతో ప్లాన్ చేస్తున్నాడా? అన్న‌ది తెలియాలి. అలాగైతే క్లీంకార తాత‌య్య‌ చిరంజీవి..నాయ‌న‌మ్మ సురేఖ కూడా హాజ‌ర‌వుతారు. ఆ ఉద్దేశంతోనే చ‌ర‌ణ్ వెకేష‌న్ కి వెళ్ల‌లేదా? ఒక‌వేళ ఇంకేదైనా ప్లానింగ్ ఉందా? అన్న‌ది తెలియాలి. ఇంకా ప‌లువురు హీరోలు ఇప్ప‌టికే విదేశాల‌కు చేరుకున్నారు.