Begin typing your search above and press return to search.

హీరోల పారితోషికంపై బాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌

కానీ ప‌రిస్థితి ఇప్ప‌టికీ మార‌లేదు స‌రికదా.. స్టార్ హీరోలు ఇప్పుడు అంద‌నంత ఎత్తులో ఉన్నారు. అందుకే ఇటీవ‌ల చాలా కాలంగా సినిమాల బ‌డ్జెట్లు పెర‌గ‌డం చర్చనీయాంశమైంది

By:  Tupaki Desk   |   6 Nov 2023 5:42 PM GMT
హీరోల పారితోషికంపై బాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌
X

స్టార్ హీరోల రెమ్యునరేషన్ ప్ర‌తిసారీ బ‌ర్నింగ్ టాపిక్. సినిమా బ‌డ్జెట్లో స‌గం మొత్తాన్ని 'స్టార్ హీరో- స్టార్ డైరెక్ట‌ర్' జోడీకి పారితోషికంగా చెల్లిస్తుంటే, ఇక సినిమా మేకింగ్ కోసం నిర్మాత ఎక్క‌డి నుంచి డ‌బ్బు తేగ‌ల‌డు? అంటూ చాలా విమ‌ర్శ‌లు ఉన్నాయి. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జీవించి ఉన్న రోజుల్లో హీరోలు, ద‌ర్శ‌కులు పారితోషికాలు త‌గ్గించుకోవాల‌ని డిమాండ్ చేసేవారు.

కానీ ప‌రిస్థితి ఇప్ప‌టికీ మార‌లేదు స‌రికదా.. స్టార్ హీరోలు ఇప్పుడు అంద‌నంత ఎత్తులో ఉన్నారు. అందుకే ఇటీవ‌ల చాలా కాలంగా సినిమాల బ‌డ్జెట్లు పెర‌గ‌డం చర్చనీయాంశమైంది. అయితే ఇలా పెర‌గ‌డానికి హీరోనే కార‌ణం అని అంటే మాత్రం తెలుగు చిత్రసీమలోని పెద్ద నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఒప్పుకోవ‌డం లేదు. తాజా ఈవెంట్లో ఆయ‌న‌కు కొన్ని ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ''గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్‌లు సినిమాలు తీయ‌కుండా ఎందుకు దూరంగా ఉంటున్నాయి? లేదా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడంలో ఎందుకు జాగ్రత్త పడుతున్నారు అని ప్ర‌శ్నించ‌గా, అల్లు అరవింద్ 'ఖర్చు' అని ఒక్క మాటలో సమాధానం ఇచ్చారు. సినిమా ఖర్చులో కేవలం 20 నుంచి 25 శాతం మాత్రమే స్టార్ హీరోలకు అందుతుందని, వారి రెమ్యూనరేషన్ వల్ల ఖర్చు పెరగడం లేదని, అయితే వారు భారీ బడ్జెట్‌తో తీస్తున్న సినిమాల్లో నటిస్తున్నారని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. హీరో ఎవరు అనేది కూడా చూడ‌కుండా పెద్దగా, గ్రాండ్ గా చేయని సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదని అర‌వింద్ అంటున్నారు.

KGF గురించి ఈ వేదిక‌పై అల్లు అర‌వింద్ ప్ర‌స్థావించారు. KGF కి ముందు హీరో య‌ష్ పెద్ద‌ స్టార్ కాదు. కానీ సినిమా భారీ కాన్వాస్ తో పెద్దగా నిర్మించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గీతా ఆర్ట్స్ నుంచి రెండు పెద్ద సినిమాలు రావాల్సి ఉండగా ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల వాయిదా పడుతున్నాయ‌ని అల్లు అరవింద్ వెల్లడించారు.