Begin typing your search above and press return to search.

హీరోయిన్స్ లేరు.. యంగ్ హీరోల సోలో ఫైట్

విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు హీరోలు హీరోయిన్స్ లేకుండానే తమ సినిమాలని ప్రమోట్ చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 4:06 AM GMT
హీరోయిన్స్ లేరు.. యంగ్ హీరోల సోలో ఫైట్
X

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోలలో కొంతమంది క్రియేటివ్ వేలో తమ సినిమాలని ప్రమోట్ చేసుకుంటూ మార్కెట్ లోకిబలంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలా వెళ్లే వారిలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముందుంటాడు. తాను ఏ సినిమా చేస్తే ఆ మూవీలో హీరో క్యారెక్టర్ ఆటిట్యూడ్ ని రిలీజ్ వరకు మెయింటేన్ చేస్తూ మూవీకి హైప్ తీసుకొస్తాడు. ఈ స్ట్రాటజీ టాలీవుడ్ లో బాగా వర్క్ అవుట్ అయ్యింది.

ఇప్పుడు ఖుషి చిత్రానికి కూడా దానినే కొనసాగిస్తున్నారు. అలాగే మరో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అయితే తన కామిక్ ఆటిట్యూడ్ తో సెటైర్స్ వేస్తూ, ఫన్నీ ఇమిటేషన్స్ తో ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. మంచి ఎంటర్టైనర్ గా అందరూ నవీన్ కి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సినిమాని మార్కెట్ చేయడానికి కొన్ని ప్రమోషనల్ వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు.

నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు హీరోలు హీరోయిన్స్ లేకుండానే తమ సినిమాలని ప్రమోట్ చేసుకుంటున్నారు. సమంత అనారోగ్య కారణాలు చూపించి ఖుషి మూవీ ప్రమోషన్స్ నుంచి తప్పుకుంది. యూఎస్ లో మెడికేషన్ కోసం వెళ్ళిపోయింది. దీంతో విజయ్ అంతా తానై ఖుషి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

నవీన్ పొలిశెట్టి కూడా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాని తానే బలంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనుష్క ప్రమోషన్స్ కి అటెండ్ కాలేదు. కారణం తెలియదు కానీ వచ్చే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. అందుకే సినిమాను తన భుజాలపై వేసుకొని ప్రేక్షకులకి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవాలని కష్టపడుతున్నాడు.

మొత్తానికి యంగ్ హీరోలు ఇద్దరు కూడా సీనియర్ హీరోయిన్స్ తో జత కట్టామని సంతోషించారు. అయితే అంత పెద్ద కో స్టార్స్ ఉన్న కూడా తామే సినిమాని ప్రమోట్ చేసుకోవాల్సి వస్తుంది. కనీసం సినిమా ప్రమోషన్ లో కాస్తా సహకారం కూడా వారి నుంచి దొరకడం లేదని టాలీవుడ్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు.