Begin typing your search above and press return to search.

2023 లో ముగ్గురు సూప‌ర్ స్టార్లు కాలికి స‌ర్జ‌రీలు!

హీరోలు ఆన్ సెట్స్ లో అప్పుడ‌ప్పుడు గాయాల బారిన ప‌డుతుంటారు. రియ‌ల్ స్టంట్లు చేసేట ప్పుడు..ప్ర‌మాద‌వ శాత్తు గాయాల‌వుతుంటాయి

By:  Tupaki Desk   |   1 Oct 2023 12:30 AM GMT
2023 లో ముగ్గురు సూప‌ర్ స్టార్లు కాలికి స‌ర్జ‌రీలు!
X

హీరోలు ఆన్ సెట్స్ లో అప్పుడ‌ప్పుడు గాయాల బారిన ప‌డుతుంటారు. రియ‌ల్ స్టంట్లు చేసేట ప్పుడు..ప్ర‌మాద‌వ శాత్తు గాయాల‌వుతుంటాయి. చిన్న పాటి గాయాలు పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌వు. కానీ కొన్నిసార్లు అవే తిర‌గ‌బెడుతుంటాయి. ఫ‌లితంగా కొన్ని నెల‌లు త‌ర్వాత స‌ర్జ‌రీలకు వెళ్లాల్సి వస్తుంటుంది. తాజాగా 2023 లో ముగ్గురు సూప‌ర్ స్టార్లు అలా స‌ర్జరీలు చేయించుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

ఆ మ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి -సురేఖ‌తో క‌లిసి అమెరికా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అప్పుడాయ‌న ఏదో వెకేష‌న్ కి వెళ్లారు అనుకున్నారంతా. కానీ అస‌లు సంగ‌తి త‌ర్వాత వెలుగులోకి వ‌చ్చింది. చాలా కాలంగా మోకాలి నొప్పి ఉండ‌టంతో చిన్న మైన‌ర్ స‌ర్జరీ ప‌డ‌టంతో అమెరికాలో వైద్యం చేయించుకున్న‌ట్లు తెలిసింది. అయితే అలా నొప్పి రావ‌డానికి కార‌ణంగా ఆయ‌న గ‌తంలో చేసిన డాన్సుల కార‌ణంగానేన‌ని వినిపించింది. డాన్సులు చేసేట‌ప్పుడు మోకాలిపై తీవ్ర‌మైన ఒత్తిడి ప‌డ‌టంతో స‌ర్జ‌రీకి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని అన్నారు.

అలాగే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కూడా కాలికి కూడా స‌ర్జ‌రీ అయిన సంగ‌తి తెలిసిందే. తొలుత ఆయ‌న కూడా యూర‌ప్ టూర్ వెళ్లిన‌ట్లే ప్ర‌చారం సాగింది. త‌ర్వాతే ఆస‌లు మ్యాట‌ర్ లీకైంది. సినిమా షూటింగ్ లో భాగంగా కాలికి త‌గిలిన గాయానికి చిన్న‌పాటి స‌ర్జ‌రీ అవ‌స‌రం ప‌డ‌టంతో త‌న టీమ్ తో పాటు విదేశాల‌కు వెళ్లి స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు విదేశాల్లోనే ఉన్నారు. మ‌రో రెండు..మూడు రోజుల్లో తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు. ఇది ప్ర‌భాస్ కి త‌గిలిన పాత గాయంగానే తెలుస్తోంది.

'బాహుబ‌లి' షూటింగ్ స‌మ‌యం నుంచే కాలి గాయంతో ఇబ్బంది ప‌డుతున్నారు. కంటిన్యూ షూటింగ్.. ఎక్సర్ సైజ్ తదితర కారణాలతో ప్రభాస్ కు మోకాలి నొప్పి రావడంతో డాక్టర్ సలహా మేరకు ఆప‌రేష‌న్ కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

అలాగే మ‌ల‌యాళం హీరో పృధ్వీరాజ్ కూడా సెట్స్ లో ప్రమాదం బారిన పడిన సంగ‌తి తెలిసిందే. 'విలాయత్ బుద్ధ' షూటింగ్ లో భాగంగా కేరళ ఆర్టీసీ బస్సులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా పృథ్విరాజ్ బస్సులో నుండి జారిపడ్డారు. దీంతో కాలికి తీవ్ర గాయమైంది. దీంతో పృథ్విరాజ్ కాలికి సర్జరీ చేసారు. దాదాపు మూడు నెల‌లుగా ఆయ‌న విశ్రాంతి లోనే ఉన్నారు. తాజాగా కోలుకున్న‌ట్లు ట్వీట్ చేయ‌డంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా ఒకే ఏడాది ముగ్గురు స్టార్ హీరోలు మోకాలి గాయాల‌తో స‌ర్జ‌రీలకు వెళ్లాల్సి వ‌చ్చింది.